Gadadhari Hanuman : ‘గదాధారి హనుమాన్’.. డివోషనల్ టచ్‌తో మరో సినిమా..
తాజాగా ఈ గదాధారి హనుమాన్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
Gadadhari Hanuman : ఇటీవల పలు సినిమాలు డివోషనల్ టచ్ తో వచ్చి మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇదే కోవలో మరి సినిమా రాబోతుంది. కొత్త నిర్మాణ సంస్థ విరభ్ స్టూడియోస్ సమర్పణలో రోహిత్ కొల్లి దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రకటించారు. ‘గదాధారి హనుమాన్’ అనే ఆసక్తికర టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు. రవి, హర్షిత, బసవరాజు హురకదలి, రమేష్ పండిట్, నగేష్ మైయ్య, కళ్యాణ్, సునంద.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ గదాధారి హనుమాన్ సినిమా షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తిచేసి నవంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.
Also Read : Pawan Kalyan : పవన్ రాజవైభోగం.. బర్త్ డే రోజు సరదా ఫోటో షేర్ చేసిన మెగా హీరో..
తాజాగా ఈ గదాధారి హనుమాన్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ టైటిల్ పోస్టర్ చూస్తుంటే టైటిల్ లో ఆంజనేయుని జయకేతనం, టైటిల్ చివర హనుమంతుడి తోక ఉండగా పోస్టర్ వెనుక గమనిస్తే దహన సన్నివేశాలు లాగా అనిపిస్తున్నాయి. దీంతో గదాధారి హనుమాన్ సినిమా డివోషనల్ టచ్ తో రాబోతుందని తెలుస్తుంది.
నిర్మాతలు బసవరాజు హురకదలి & రేణుక ప్రసాద్ కే.ఆర్ మాట్లాడుతూ.. గదాధారి హనుమాన్ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక సరికొత్త అనుభూతితో వస్తారు. ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తీసాము. ఈ సినిమాని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తాము అని తెలిపారు. డైరెక్టర్ రోహిత్ కొల్లి మాట్లాడుతూ.. గదాధారి హనుమాన్ సినిమాలో అన్ని రకాల అంశాలు జోడించి ఒక డివైన్ టచ్ తో అద్భుతంగా తీసాము. మా సినిమా చూసాక కల్కి, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని ప్రేక్షకులు మాకు ఇస్తారు అని తెలిపారు.