HBD Pawan kalyan : పాత ఫోటో షేర్ చేసి.. పవన్ గురించి గొప్పగా నిర్మాత SKN బర్త్ డే విషెష్ ఎలా చెప్పాడో చూడండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబ‌ర్ 2) నేడు.

HBD Pawan kalyan : పాత ఫోటో షేర్ చేసి.. పవన్ గురించి గొప్పగా నిర్మాత SKN బర్త్ డే విషెష్ ఎలా చెప్పాడో చూడండి..

Producer SKN wishes to Pawan Kalyan

Updated On : September 2, 2024 / 11:42 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబ‌ర్ 2) నేడు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్ల‌తో పాటు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ప‌వ‌న్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ సైతం ప‌వ‌న్‌కు స్పెష‌ల్ విషెస్ తెలియ‌జేశారు.

Nagababu – Pawan Kalyan : నా అప్పులు తీర్చడానికే ‘గబ్బర్ సింగ్’ చేసాడు.. రెమ్యునరేషన్ విషయంలో బండ్ల గణేష్‌తో పవన్ ఒప్పందం ఇదే..

‘ఇతడే మన కళ్యాణ్ నుండి ఈయనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు ఎదిగిన మీ చరిత్ర అనితర సాధ్యం. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మీ తీరు ఆచరణీయం. అన్నయ్య కు తమ్ముడిగా మొదలై లక్షలాది తమ్ముళ్ళకి అన్నయ్యగా మారిన మీరు ఇంతింతై వటుడింతే అన్నట్లు ఇంకా అత్యున్నత శిఖరాలు ఎదగాలి. కథా నాయకుడుగా గెలిచి ప్రజల నాయకుడిగా నిలిచి గెలిచి గెలిపించిన మీ జీవితం స్ఫూర్తిదాయకం. ఉత్తేజ పూరితం ఉత్ప్రేరకం సంకల్ప కారకం. దశాబ్దాలుగా మీ బాటలో నడక వ్యాపకం కాదు నిలిచి ఉండే జ్ఞాపకం. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు.’ అంటూ ఎస్‌కేఎన్ ట్వీట్ చేశారు.