కరోనాకు మనదగ్గర కావాల్సినంత‌ స‌బ్బులు ఉన్నాయా..? ప్రధానికి చిన్నారుల ప్రశ్న!

  • Published By: sreehari ,Published On : September 3, 2020 / 10:31 PM IST
కరోనాకు మనదగ్గర కావాల్సినంత‌ స‌బ్బులు ఉన్నాయా..? ప్రధానికి చిన్నారుల ప్రశ్న!

కరోనావైరస్ వ్యాక్సిన్ అతి త్వరలో వస్తుందనే గట్టి నమ్మకం తనకుందని నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ ఆ దేశ విద్యార్థులతో చెప్పారు. చిన్నారులకు వేసే అనేక టీకాలలో కరోనా వ్యాక్సిన్ కూడా ఒక టీకా అవుతుందని తాను భావిస్తున్నానని తెలిపారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన తన మూడవ సమావేశంలో నార్వే ప్రధాని ఎర్నా మాట్లాడారు.. కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి పెద్దలను ప్రశ్నలు అడగడానికి అనుమతించలేదు.



మార్చి 16న జరిగిన మొట్టమొదటి బ్రీఫింగ్‌లో.. సోల్బెర్గ్ పిల్లలకు మహమ్మారి గురించి భయపడొద్దని సూచించారు. చిన్న పిల్ల‌లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు ఇచ్చారు. తన చిన్న‌త‌నంలో మీజిల్స్‌తో బాధ‌ప‌డిన‌ట్లు ఆమె చెప్పారు. అప్పుడు మీజిల్స్(త‌ట్టు) వ్యాక్సిన్ తీసుకున్నామ‌ని తెలిపారు.. ఆ రోజుల్లో అదే పెద్ద జ‌బ్బు అన్నారు. ఇప్పుడు పిల్లందరికి ముందుగానే మీజిల్స్ వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు.

కరోనా వ్యాక్సిన్‌ను తప్పక కనుగొంటామని అనుకుంటున్నానని చెప్పారు. కరోనాకు టీకాలు వేయడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉంటామని సోల్బెర్గ్ చెప్పారు. టీవీ ప్రోగ్రామ్ ద్వారా ప్ర‌ధాని సోల్‌బర్గ్ పిల్ల‌ల ప్ర‌శ్న‌కు స‌మాధానాలు ఇచ్చారు.



మ‌న ద‌గ్గ‌ర కావాల్సినంత స‌బ్బులు ఉన్నాయా? మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు మ‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉన్నాయా లాంటి ప్ర‌శ్న‌లను పిల్లలు ప్రధానికి సంధించారు. మ‌న ద‌గ్గ‌ర కావాల్సినంత స‌బ్బు ఉంద‌న్నారు. నార్వేలో ఇప్ప‌టి వ‌ర‌కు 10 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 264 మంది చ‌నిపోయారు. పువ్వుల వాసన చూస్తే బాగుంటుంది కదా అని సోల్బర్గ్ పిల్లలను అడిగారు.. మంచి సువాసన కలిగిన యాంటిబాక్ ను కనుగొంటారని ఆమె అన్నారు.



మహమ్మారిని ఎదుర్కోవటానికి నార్వేలో తగినంత సబ్బులు దొరుకుతాయని మంత్రి కెజెల్ ఇంగోల్ఫ్ రోప్‌స్టాడ్ పిల్లల ప్రశ్నలకు సమాధాన మిచ్చారు. నార్వేలోని పాఠశాలలు ఏప్రిల్ 27 నుండి తెరుచుకున్నాయి. ఆగస్టు 17న వేసవి సెలవుల తర్వాత సాధారణ స్థితికి వచ్చాయి. విద్యార్థులు ఫేస్ మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదు. కానీ, సామాజికంగా దూరాన్ని తప్పక పాటించాలని సూచించారు.