Donald Trump : పోల్ రాకెటింగ్ కేసులో డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్, బాండ్‌పై విడుదల

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు అయి బాండ్‌పై విడుదలయ్యారు. జార్జియాలో 2020వ సంవత్సరంలో జరగనున్న ఎన్నికలను తారుమారు చేసేందుకు పన్నాగం పన్నారనే ఆరోపణలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కోర్టులో లొంగిపోయారు. అనంతరం ట్రంప్ ను 2,00,000 డాలర్ల బాండ్‌పై విడుదల చేశారు....

Donald Trump : పోల్ రాకెటింగ్ కేసులో డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్, బాండ్‌పై విడుదల

Donald Trump arrested

Updated On : August 25, 2023 / 8:00 AM IST

Donald Trump arrested : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు అయి బాండ్‌పై విడుదలయ్యారు. జార్జియాలో 2020వ సంవత్సరంలో జరగనున్న ఎన్నికలను తారుమారు చేసేందుకు పన్నాగం పన్నారనే ఆరోపణలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కోర్టులో లొంగిపోయారు. అనంతరం ట్రంప్ ను 2,00,000 డాలర్ల బాండ్‌పై విడుదల చేశారు. (Donald Trump arrested, released)

Ukraine : యుక్రెయిన్‌కు త్వరలో ఎఫ్ 16 ఫైటర్ జెట్‌లు… అమెరికా టాప్ జనరల్ వెల్లడి

జార్జియా ఎన్నికల కేసుకు సంబంధించి మాజీ అమెరికా అధ్యక్షుడిని అరెస్టు చేసి ఫుల్టన్ కౌంటీ జైలులో గురువారం రాత్రి ఉంచినట్లు జైలు రికార్డులు చూపిస్తున్నాయి. (poll racketeering case) దాదాపు 20 నిమిషాల పాటు ఆయన జైలులోనే ఉన్నారు. దీంతో న్యూజెర్సీకి తిరిగి వచ్చే విమానం కోసం విమానాశ్రయానికి వచ్చారు. నేవీ సూట్,ఎరుపు టై ధరించి, కోపంగా కెమెరా వైపు చూస్తున్న ట్రంప్ చిత్రంలో దర్శనమిచ్చారు.

Chandryaan-3 :చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ మూన్‌వాక్‌ ప్రారంభం…ఇస్రో ల్యాండర్ ఇమేజర్ కెమెరా చిత్రాల విడుదల

తాను ఏ తప్పు చేయలేదని ట్రంప్ చెప్పారు. న్యాయాన్ని అపహాస్యం చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది నాలుగోసారి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ముందు ట్రంప్ లొంగిపోయారు. ట్రంప్ గురువారం అట్లాంటాలోని హార్ట్‌ఫీల్డ్-జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ట్రంప్ రాకకు ముందు ఫుల్టన్ కౌంటీ జైలు వెలుపల భద్రతను పెంచారు. కేసును పర్యవేక్షిస్తున్న రాష్ట్ర న్యాయమూర్తి ఇద్దరు ప్రతివాదుల బాండ్ ఒప్పందాలను ఆమోదించారు.