Donald Trump: సీఎన్‌ఎన్‌ నెట్‌వర్క్‌పై పరువునష్టం దావా వేసిన డొనాల్డ్ ట్రంప్

సీఎన్‌ఎన్‌ నెట్‌వర్క్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. 475 మిలియన్‌ డాలర్ల పరిహారం కోరుతూ ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ లాడెర్‌ డేల్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో దావా వేశారు.

Donald Trump: సీఎన్‌ఎన్‌ నెట్‌వర్క్‌పై పరువునష్టం దావా వేసిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump

Donald Trump: సీఎన్‌ఎన్‌ నెట్‌వర్క్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. 475 మిలియన్‌ డాలర్ల పరిహారం కోరుతూ ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ లాడెర్‌ డేల్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో దావా వేశారు. 29 పేజీలతో కూడిన దావాను ట్రంప్‌ తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు.

JK DG Murdered : జమ్మూకశ్మీర్‌ జైళ్లశాఖ డీజీ హేమంత్ కుమార్ లోహియా హత్య

ఇందులో సీఎన్‌ఎన్‌ నెట్‌వర్క్‌ తన పరువుకు భంగం కలిగించిందని ఆరోపించారు. 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని భయపడి.. ఇటీవల తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని వాజ్యంలో ట్రంప్ ఆరోపించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జాత్యహంకారి, రష్యన్‌ లూకీ, తిరుగుబాటుదారుడు.. హిట్లర్‌గా పేర్కొంటూ తన పరువుకు భంగం కలిగించేలా ప్రయత్నిస్తోందని ట్రంప్‌ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ వంటి ఇతర ప్రధాన వార్తా సంస్థలతో వైరాన్ని కలిగి ఉన్నాడు, వాటిని “నకిలీ వార్తలు” అని ముద్రవేసి సోషల్ మీడియాలో పదే పదే వారిపై ట్రంప్, అతని వర్గీయులు విరుచుకుపడ్డాడు.