JK DG Murdered : జమ్మూకశ్మీర్‌ జైళ్లశాఖ డీజీ హేమంత్ కుమార్ లోహియా హత్య

జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా హత్య గావించబడ్డారు. జమ్మూలోని ఆయన నివాసంలో సోమవారం అనుమానాస్పద స్థితిలో లోహియా మృతదేహం లభ్యమైందని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించారు.

JK DG Murdered : జమ్మూకశ్మీర్‌ జైళ్లశాఖ డీజీ హేమంత్ కుమార్ లోహియా హత్య

JK DG Murdered : జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా హత్య గావించబడ్డారు. జమ్మూలోని ఆయన నివాసంలో సోమవారం అనుమానాస్పద స్థితిలో లోహియా మృతదేహం లభ్యమైందని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించారు. అయితే, డీజీ ఇంట్లో పని చేసే వ్యక్తే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న పని మనిషి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

డీసీ హత్యకు గురవ్వడంతో ఆయన కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. లోహియా మృతిపై సీనియర్‌ పోలీస్‌ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. హేమంత్ కుమార్ లోహియా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్‌ డిప్యూటేషన్‌ నుంచి తిరిగి వచ్చారు. జమ్మూకు తిరిగి వచ్చే ముందు బీఎస్‌ఎఫ్‌లో పని చేశారు. ఆ తర్వాత డీజీపీ హోదాలో పదోన్నతి పొందారు. ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌ డీజీపీగా నియామకమయ్యారు.

constable suicide : పెళ్లైన వంద రోజులకే పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య

ముప్పై సంవత్సరాల సుధీర్ఘ కెరీర్‌లో పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో సెంట్రల్‌ కశ్మీర్‌ డీఐజీగా ఉన్నారు. లాల్ చౌక్ వద్ద జరిగిన ఫిదాయీన్ దాడిలో పాకిస్థానీ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత దక్షిణ కాశ్మీర్ డీఐజీగా పని చేశారు. సెంట్రల్ డిప్యూటేషన్‌పై వెళ్లడానికి ముందు సీఐడీలోనూ విశేష సేవలందించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.