Ida Storm : నీట మునిగిన న్యూయార్క్..ఎమర్జెన్సీ విధించిన గవర్నర్

భారీ వర్షాలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఐడా తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.

Ida Storm : నీట మునిగిన న్యూయార్క్..ఎమర్జెన్సీ విధించిన గవర్నర్

Newyork (1)

Ida Storm భారీ వర్షాలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఐడా తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా న్యూయార్క్ దాని పక్కనే ఉన్న న్యూజెర్సీ రాష్ట్రాలు జలదిగ్భనంలో చిక్కుకుపోయాయి. న్యూయార్క్ లో అయితే స‌బ్ స్టేష‌న్లు, ఇళ్లు, రోడ్లు అన్నీ నీట‌మునిగాయి. వరదల ధాటికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది నిరాశ్రయులయ్యారు. ఆకస్మిక వరదల కారణంగా.. న్యూయార్క్‌ సిటీలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

న్యూయార్క్ లో చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌ వ‌ర్షం కురిసిన‌ట్లు మేయ‌ర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు. రోడ్ల‌పై అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో న్యూయార్క్‌ లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ప్రకటించారు. ఎయిర్ పోర్ట్ లను,రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు చెప్పారు. న్యూయార్క్‌లో స‌బ్‌వే స‌ర్వీసుల‌ను పూర్తిగా మూసివేశారు. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని గవర్నర్ సూచించారు. నగ‌ర ప్ర‌జ‌లు ఎవ‌రూ రోడ్ల‌మీద‌కు రావ‌ద్దు అంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

ఇక, న్యూజెర్సీలో ఇదే పరిస్థితి నెలకొనడంతో ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీని విధించారు గవర్నర్. డ్లు చెరువులు అవుతుంటే… కార్లు పడవల్లా మారిపోతున్నాయి. బిల్డింగ్ సెల్లార్లలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆకస్మిక వరదల వల్ల న్యూజెర్సీలో ఒక‌రు మృతిచెందిన‌ట్లు అధికారులు తెలిపారు. న్యూజెర్సీలోని కేర్నీలో పోస్ట‌ల్ ఆఫీసు బిల్డింగ్ కూలిపోగా.. ఆ స‌మ‌యంలో అందులో తొమ్మిది మంది ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది శిథిలాల‌ను తొలిగిస్తున్నారు. మరోవైపు,అమెరికాలోని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వరదలు, టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి