Elon Musk: మస్క్ డబ్బులు విరాళం ఇవ్వండి.. ప్లాన్ బాగుండకపోతే మెడపట్టుకుని గెంటేయండి

అడిగినట్లు రూ.600 కోట్ల విలువ చేసే షేర్లు అమ్మి ఆ డబ్బును విరాళంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ప్రపంచంలో ఆకలి నిర్మూలనకు ఆ డబ్బును ఖర్చు పెడతారా.. తర్వాత ఆ లెక్కలను పారదర్శకంగా..

Elon Musk: మస్క్ డబ్బులు విరాళం ఇవ్వండి.. ప్లాన్ బాగుండకపోతే మెడపట్టుకుని గెంటేయండి

Elon Musk

Elon Musk: ‘అడిగినట్లు రూ.45 వేల కోట్ల విలువ చేసే షేర్లు అమ్మి ఆ డబ్బును విరాళంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ప్రపంచంలో ఆకలి నిర్మూలనకు ఆ డబ్బును ఖర్చు పెడతారా.. తర్వాత ఆ లెక్కలను పారదర్శకంగా అందరికీ చూపించగలరా..’ అంటూ సవాల్ విసిరారు ఎలన్ మస్క్. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మాట్లాడతూ.. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమానికి విరాళం ఇవ్వడానికి రెడీ అన్నారు.

ట్విట్టర్‌లో ఐరాస డబ్ల్యూఎఫ్‌పీ డైరెక్టర్‌ డేవిడ్‌ బీస్లే అడిగిన ప్రశ్నకు ఈ విధంగా జవాబిచ్చారు. ఇటీవల హెర్ట్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ అనే సంస్థ టెస్లా నుంచి లక్ష ఎలక్ట్రిక్‌ కార్ల కోసం ఆర్డర్‌ ఇచ్చింది. వీటి ఫలితంగా మస్క్‌ సంపద ఒక్కసారిగా 3వేల 600 బిలియన్ డాలర్లు పెరిగిందట. ఇదే విషయాన్ని ప్రస్తావించిన బీస్లే.. అందులో నుంచి ఆరోవంతు అంటే 600 బిలియన్ డాలర్లతో ఆకలి బాధతో అల్లాడుతున్న 4.2 కోట్ల మందిని కాపాడొచ్చని కామెంట్ చేశారు.

మస్క్‌ తో పాటు ప్రపంచ కుబేరులంతా విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని ఇటీవల సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో కోరారు. ఆ సమయంలో మస్క్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ పేరును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ సంపదలో కొద్ది శాతం ఇచ్చినా ప్రపంచంలోని ఆకలిని పారదోలే అవకాశం ఉందని అన్నారు.

…………………………………….. : హుజూరాబాద్ మండల ఓటర్లు ఎటువైపు ?

స్పేస్‌ ఎక్స్‌ అధిపతి కూడా అయిన మస్క్‌ ప్రస్తుత సంపద 31వేల 100 కోట్ల డాలర్లు. అందులో నుంచి 600 బిలియన్ డాలర్లు అంటే చాలా తక్కువ. మస్క్‌ సంపద సెకనుకి 5.34 లక్షల డాలర్లు అని ఇటీవల ఓ సంస్థ లెక్కల్లో తేలింది.

భౌగోళిక రాజకీయ అస్థిరతను, సామూహిక వలసలను నివారించడానికి, కరువు అంచుల్లో ఉన్న 4.2 కోట్ల మందికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సాయంతో ఒక ఆశ కల్పించొచ్చని, భవిష్యత్‌ మార్చవచ్చన్నారు. ‘నెక్స్‌ ఫ్లైట్‌ ఎక్కి మీ దగ్గరికొస్తా చర్చిద్దాం. చెప్పింది నచ్చకపోతే మెడ పట్టుకొని బయటకి గెంటేయండి’ అని మస్క్ సవాల్‌పై బీస్లే వివరణ ఇచ్చారు.