Elon Musk: మస్క్‌కు క్లారిటీ వచ్చింది.. ‘యాపిల్’ అలా చేయదంటూ ట్వీట్..

యాపిల్ సీఈఓ టీమ్ కుక్ తో బుధవారం మస్క్ భేటీ అయ్యాడు. ఈ భేటీ వివరాలను తన ట్విటర్ ఖాతాలో మస్క్ వెల్లడించాడు. టీమ్ కుక్ తో సమావేశం అయ్యాను. యాప్ స్టోర్ నుంచి ట్విటర్ ను తొలగిస్తుందన్న తన వాదనకు పూర్తి క్లారిటీ వచ్చింది. యాపిల్ ఎప్పుడూ అలా చేయలేదని టిమ్ స్పష్టంగా చెప్పాడు.

Elon Musk: మస్క్‌కు క్లారిటీ వచ్చింది.. ‘యాపిల్’ అలా చేయదంటూ ట్వీట్..

Elon Musk

Elon Musk: గత రెండు రోజులుగా యాపిల్ పై దుమ్మెత్తిపోసిన బిలియనీర్, ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్.. ఇప్పుడు అదేంలేదు.. మా మధ్య సమస్యలు పరిష్కారం అయ్యాయంటూ ఓ ట్వీట్ చేశాడు. ఆపిల్ సీఈఓ‌‌ టీమ్ కుక్‍తో సమావేశం జరిగిందని, నేను లేవనెత్తిన అన్ని సమస్యలకు పరిష్కారం లభించిందని మస్క్ అన్నారు. గత రెండురోజుల క్రితం Apple Inc యాప్ స్టోర్ నుండి ట్విటర్ ను బ్లాక్ చేస్తానని బెదిరిస్తోందని మస్క్ ఆరోపించాడు. యాపిల్ సంస్థ ట్విటర్ లో ప్రకటనలను ఆపివేసిందని వరుస ట్వీట్లతో మస్క్ హడావుడి చేశాడు.

Elon Musk: ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుకు నెల రోజులు..! మస్క్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే..

సోమవారం వరుస ట్వీట్లతో యాపిల్ పై ఆరోపణలు గుప్పించిన మస్క్.. ట్వీట్‌లో యాపిల్ సీఈఓ కుక్ ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేసి.. ఇక్కడ ఏమి జరుగుతోంది? అంటూ మస్క్ ట్వీట్ చేశాడు. దీంతో యాపిల్ పై మస్క్ ఓ చిన్నపాటి యుద్ధానికి తెరలేపినట్లయింది. అయితే, మస్క్ ట్వీట్లకు ఆపిల్ స్పందించలేదు. సోమవారం మస్క్ ట్వీట్ చేసిన ఫిర్యాదుల జాబితాలో.. యాప్‌లో కొనుగోళ్లకు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లకు 30శాతం వరకు రుసుమును ఆపిల్ వసూలు చేస్తుంది, మస్క్ కమీషన్ చెల్లించకుండా ఆపిల్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు సూచించిన ఒక జ్ఞాపకాన్ని పోస్ట్ చేశాడు.

మస్క్, ఆపిల్ మధ్య వివాదం ముదురుతుందని భావించిన తరుణంలో యాపిల్ సీఈఓ టీమ్ కుక్ తో బుధవారం మస్క్ భేటీ అయ్యాడు. ఈ భేటీ వివరాలను తన ట్విటర్ ఖాతాలో మస్క్ వెల్లడించాడు. టీమ్ కుక్ తో సమావేశం అయ్యాను. యాప్ స్టోర్ నుంచి ట్విటర్ ను తొలగిస్తుందన్న తన వాదనకు పూర్తి క్లారిటీ వచ్చింది. యాపిల్ ఎప్పుడూ అలా చేయలేదని టిమ్ స్పష్టంగా చెప్పాడు. ఇంకా ఇతర విషయాలపైనా మామధ్య స్పష్టత వచ్చింది అంటూ మస్క్ ట్వీట్ చేశాడు. మస్క్ తాజా ట్వీట్ తో యాపిల్ వర్సెస్ ట్విటర్ అన్నట్లుగా సోషల్ మీడియాలో సాగిన యుద్ధానికి తెరపడినట్లేనని చెప్పొచ్చు.