EU: టిక్‌టాక్ యాప్ డిలీట్ చేయాలంటూ ఉద్యోగులకు ఈయూ ఆదేశాలు
ఈయూ తీసుకున్న ఈ నిర్ణయంపై టిక్‌టాక్ యాజమాన్యం అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిషన్ నిర్ణయంతో తాము నిరాశ చెందామని పేర్కొంది. కొన్ని అపోహల ఆధారంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, దీనిపై ఈయూ మరోసారి ఆలోచించాలని కోరింది. ‘‘మా రికార్డులను సమర్పించి, లోపాలేమైనా తలెత్తితే సరి చేయడానికి మేము ఈయూ కమిషన్‌ను సంప్రదించాము.

EU Commission to ban TikTok on staff phones
EU: చైనీస్ షార్ట్ వీడియో-షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు యూరోపియన్ కమిషన్ ప్రకటించింది. అంతే కాకుండా ఫోన్‌ల నుంచి ఈ యాప్‌ను వెంటనే డిలీట్ చేయాలంటూ తన ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించిన నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈయూ ఇండస్ట్రీ చీఫ్ థియరీ బ్రెటన్ గురువారం తెలిపారు. అయితే టిక్‌టాక్‌కు సంబంధించిన ఏవైనా సంఘటనలు సైబర్ సెక్యూరిటీలో ఇరుక్కున్నాయా అనే దానిపై ఆయన సమాధానాన్ని దాటవేశారు.
“సైబర్ సెక్యూరిటీని పెంచడానికి, కమిషన్ యొక్క కార్పొరేట్ మేనేజ్‌మెంట్ బోర్డ్ దాని కార్పొరేట్ పరికరాలు, కమిషన్ మొబైల్ పరికర సేవలో నమోదు చేసుకున్న వ్యక్తిగత పరికరాలలో టిక్‌టాక్ అప్లికేషన్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది” అని ఈయూ ఎగ్జిక్యూటివ్ ఒక ప్రకటనలో తెలిపారు. “సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు, కమిషన్ యొక్క కార్పొరేట్ పర్యావరణానికి వ్యతిరేకంగా సైబర్-దాడుల కోసం ఉపయోగించబడే చర్యల నుంచి కమిషన్‌ను రక్షించడం ఈ చర్య లక్ష్యం” అని ఆయన తెలిపారు.
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేడాకు ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు.. పోలీసుల కస్టడీ నుంచి విడుదల
కాగా, ఈయూ తీసుకున్న ఈ నిర్ణయంపై టిక్‌టాక్ యాజమాన్యం అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిషన్ నిర్ణయంతో తాము నిరాశ చెందామని పేర్కొంది. కొన్ని అపోహల ఆధారంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, దీనిపై ఈయూ మరోసారి ఆలోచించాలని కోరింది. ‘‘మా రికార్డులను సమర్పించి, లోపాలేమైనా తలెత్తితే సరి చేయడానికి మేము ఈయూ కమిషన్‌ను సంప్రదించాము. యూరోపియన్ యూనియన్ అంతటినీ కలిపి ప్రతి నెలా టిక్‌టాక్‌కి వచ్చే 125 మిలియన్ల మంది వ్యక్తుల డేటాను రక్షించడంపై వివరణ ఇవ్వాలని అనుకున్నాం” అని టిక్‌టాక్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.