Donal Trump Arrested : అమెరికా చరిత్రలో సంచలనం.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్

Donal Trump Arrested : అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటకట్టుకున్నారు.

Donal Trump Arrested : అమెరికా చరిత్రలో సంచలనం.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్

Donal Trump Arrest(Photo : Google)

Donal Trump Arrested : అమెరికా రాజకీయ చరిత్రలో సంచలనం నమోదైంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(76) అరెస్ట్ అయ్యారు. అధికారులు ఆయనను జైలుకి తరలించారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు అక్రమ చెల్లింపుల కేసుల డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. మాన్ హట్టన్ కోర్టులో ట్రంప్ లొంగిపోయారు.

దీంతో అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటకట్టుకున్నారు. కాగా, తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ట్రంప్ ఆరోపించారు. మరోవైపు మాన్ హట్టన్ కోర్టు ఎదుట ట్రంప్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు.(Donal Trump Arrested)

పోర్న్ స్టార్‌ స్టార్మీ డేనియ‌ల్స్ కు ల‌క్షా 30 వేల డాల‌ర్ల డ‌బ్బు ఇచ్చిన ట్రంప్‌పై ఆ కేసులో నేరాభియోగాలు న‌మోదయ్యాయి. లైంగిక సంబంధం బయట పెట్టకుండా శృంగార తార డేనియల్స్ కు ట్రంప్ డబ్బు చెల్లించారు. ట్రంప్‌ అరెస్ట్ దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా న్యూయార్క్‌ సహా అమెరికాలోని పలు నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

Also Read..E-Scooters Ban: సెప్టెంబర్ 1 నుంచి పారిస్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల నిషేధం.. ఎందుకంటే..

ఓ శృంగార తార నోటికి తాళం వేయడానికి ఆమెకు డబ్బు ముట్టజెప్పిన కేసులో ట్రంప్‌ పై క్రిమినల్‌ అభియోగం మోపాలని గత గురువారం మాన్‌హట్టన్‌ గ్రాండ్‌ జ్యూరీ నిర్ణయించిన విషయం తెలిసిందే. సాధారణంగా ఇలాంటి విచారణల్లో నిందితులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొస్తారు. అయితే ట్రంప్‌ విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు.

Also Read..Twitter Logo Changed: పిట్ట పోయింది డాగ్‍‌‌ వచ్చింది..! ట్విటర్‌లో కనిపించని బ్లూ బర్డ్.. అయోమయంలో నెటిజన్లు..

2006లో ట్రంప్‌, తానూ ఓ కార్యక్రమంలో కలుసుకున్నామని, తర్వాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నామని స్టార్మీ డేనియల్స్‌ అనే శృంగార చిత్రాల నటి ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచాలంటూ ట్రంప్‌ న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారన్నది ఆరోపణ. ఇది నిజమేనని కోహెన్‌ ఒప్పుకున్నారు. దీంతో ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్‌ అభియోగం మోపాలని గ్రాండ్‌ జ్యూరీ నిర్ణయించింది.