కరోనాపై గెల్చామనుకొనేలోపే చైనాకు కొత్త ప్రమాదం. ఎలాంటి లక్షణాలు లేవు..అయినా కరోనాను వ్యాప్తిచేస్తున్నారు క్యారియర్లు!

  • Published By: vamsi ,Published On : March 25, 2020 / 09:01 AM IST
కరోనాపై గెల్చామనుకొనేలోపే చైనాకు కొత్త ప్రమాదం. ఎలాంటి లక్షణాలు లేవు..అయినా కరోనాను వ్యాప్తిచేస్తున్నారు క్యారియర్లు!

కరోనా లక్షణాలు లేకుండా వ్యాధిని వ్యాప్తి చేసేవారి సంఖ్య గణనీయంగా పెరగడం.. ఇప్పుడు చైనాకు తలనొప్పిగా మారింది. లక్షణాలు లేనివారు సైతం కరోనా వైరస్ వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.

చైనాలో గణనీయమైన సంఖ్యలో లక్షణం లేని క్యారియర్లు ఉండటం ప్రజలలో ఆందోళన కలిగిస్తోందని, ప్రజలు అనారోగ్యంతో ఉన్నారని తెలియకుండానే COVID-19 ను వ్యాప్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. 

ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వినాశనం కొనసాగిస్తుంది. అయితే చైనా మాత్రం వ్యాధిపై విజయం సాధించినట్లుగా చెప్పడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే ప్రయాణ పరిమితులను సడలించింది. వైరస్ కేంద్రంగా ఉన్న హుబీ ప్రావిన్స్ సరిహద్దును రెండు నెలల షట్ డౌన్ తర్వాత బుధవారం(25 మార్చి 2020) అందుబాటులోకి తీసుకుని వచ్చారు. 

అయితే లక్షణాలు లేని వ్యక్తులు లాక్ డౌన్ ముగియడంతో వేలాది మందికి అంటువ్యాధులను తిరిగి తగిలిస్తారనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం చివరి నాటికి చైనాలో 81,218 కరోనావైరస్ కేసులు, 3,281 మరణాలు నమోదయ్యాయి.

మార్చి 18వ తేదీ నుంచి మార్చి 22 వరకు కొత్తగా.. ఎటువంటి కరోనా కేసులను నమోదు చేయలేదు. ఈ విషయాన్ని వుహాన్ సిటీ అధికారులు మార్చి 20 న వెల్లడించారు. అయితే కొత్త అధ్యయనాలు మాత్రం లక్షణాలు లేని క్యారియర్లు ప్రమాదాలను కలిగిస్తారని భావిస్తున్నారు.

ఇటీవల 104మందికి కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించినా కూడా వారిలో 33మందికి లక్షణాలు ఏ మాత్రం లేకపోవడం కాస్త వారికి ఇబ్బందిగా కనిపిస్తుంది. చాలామంది అంతటా ఆరోగ్యంగా కనిపించినప్పటికీ వారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది.

మార్చి 23 న ప్రచురించిన అధ్యయనం ప్రకారం మాత్రం.. నైరుతి చైనా నగరమైన చాంగ్‌కింగ్‌లో కేసులను చూస్తే, 18% మంది రోగులు లక్షణాలు లేకుండా ఉన్నారు. ఇది మాత్రం ఆ దేశంలో కాస్త ఆందోళనగా ఉంది. వారు క్యారియర్లుగా ఉంటే ప్రమాదం అనేది అధికారుల అంచనా. 

See Also | ప్రపంచమంతా లాక్‌డౌన్‌తో స్తంభించిపోతుంటే, చైనా మళ్లీ పరుగు మొదలుపెట్టింది