Galapagos Darwin Arch : ప్రసిద్ధ రాతికట్టడం డార్విన్ ఆర్చ్ కూలిపోయింది!

ప్రసిద్ధ పర్యాటక రాతికట్టడం డార్విన్ ఆర్చ్ సముద్రం ఒడిలోకి జారిపోయింది. వైల్డ్ లైఫ్ లవర్స్‌కు వెరీ ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ ఇది.. ఎప్పటినుంచో పర్యాటక ప్రాంతంగా అందరిని ఆకర్షిస్తున్న ఈ రాతికట్టడంపై ఆర్చ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Galapagos Darwin Arch : ప్రసిద్ధ రాతికట్టడం డార్విన్ ఆర్చ్ కూలిపోయింది!

Galapagos Darwin Arch

Galapagos Island Darwin Arch : ప్రసిద్ధ పర్యాటక రాతికట్టడం డార్విన్ ఆర్చ్ సముద్రం ఒడిలోకి జారిపోయింది. వైల్డ్ లైఫ్ లవర్స్‌కు వెరీ ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ ఇది.. ఎప్పటినుంచో పర్యాటక ప్రాంతంగా అందరిని ఆకర్షిస్తున్న ఈ రాతికట్టడంపై ఆర్చ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గాలా పోగోస్ ద్వీపకల్పంలోని డార్విన్ ఆర్చ్ అక్కడి స్థానిక కాలమానం ప్రకారం.. మే 17, 2021న ఉదయం 11.20లకు సముద్రంలోకి జారిపోయింది. ఈ మేరకు ఈక్వెడార్ పర్యాటక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Darwin’s Arch Erosion

సహజ సిద్ధమైన రాతికట్టడంగా పేరుగాంచిన ఈ డార్వాన్ ఆర్చ్ ఇప్పుడు లేదు.. కొన్నిరోజుల వరకు రెండు స్తంభాల మధ్య వారధిలా నిలిచిన ఆర్చ్ కూలిపోవడంతో వెలవెలబోతోంది. తూర్పు ద్వీపానికి 600 మైళ్ల దూరంలో ఉన్న ఈ రాతికట్టడం డార్విన్ ఆర్చ్ ఉంది. ఈ ఆర్చ్ కుప్పకూలిపోవడానికి సముద్రపు సహజ కోత కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.


కొన్ని వేల ఏళ్ల తర్వాత ఈ రాతి కట్టడం సముద్రపు నీటిలోకి జారిపోయింది. ఈ రాతికట్టడానికి జీవశాస్త్రజ్ఞుడు చార్లెస్‌ డార్విన్‌ జ్ఞాపకంగా డార్విన్‌ ఆర్చ్‌ అని పేరు పెట్టారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో ఈ రాతికట్టడానికి ప్రత్యేక స్థానం కల్పించింది. అడ్వైంచర్స్‌, సాహసాలు చేసేవారికి టూరిస్ట్ స్పాట్.. ఫొటో షూట్‌లు చేసుకునేందుకు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తుంటారు. పర్యాటకులను సైతం ఎంతో అలరించే ఈ రాతికట్టడం ఆర్చ్ కూలిపోవడంతో రెండు స్తంభాలు మాత్రమే కనిపిస్తున్నాయి.