Pakistan Grey List: పాకిస్థాన్‌కు భారీ ఊరట.. గ్రే జాబితా నుండి పాక్‌ను తొలగించిన ఎఫ్‌ఏటీఎఫ్

2018లో ఎఫ్‌ఏటీఎఫ్ పాక్‌ను గ్రే లిస్టులో చేర్చింది. ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందకుండా నగదు అక్రమరవాణాకు పాక్ అడ్డుకట్ట వేయలేకపోయిందంటూ ఎఫ్ఏటీఎఫ్ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది.

Pakistan Grey List: పాకిస్థాన్‌కు భారీ ఊరట.. గ్రే జాబితా నుండి పాక్‌ను తొలగించిన ఎఫ్‌ఏటీఎఫ్

Pakistan

Pakistan Grey List: ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందన్న అపఖ్యాతిని మూటకట్టుకున్న పాకిస్థాన్‌కు భారీ ఊరట లభించింది. ఆ దేశాన్ని గ్రే లిస్టు దేశాల జాబితా నుంచి తొలగించినట్టు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) శుక్రవారం ప్రకటించింది. గ్రే లిస్ట్ లో చేర్చబడిన నాలుగు సంవత్సరాల తరువాత పాకిస్తాన్ పేరు చివరకు ఆ జాబితా నుంచి కొట్టివేయబడింది. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న దేశాలను గ్రే లిస్ట్‌లో పెడతారన్న విషయం తెలిసిందే.

Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭ను అనర్హుడిగా ప్రకటించిన ఎన్నికల సంఘం

2018లో ఎఫ్‌ఏటీఎఫ్ పాక్‌ను గ్రే లిస్టులో చేర్చింది. ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందకుండా నగదు అక్రమరవాణాకు పాక్ అడ్డుకట్ట వేయలేకపోయిందంటూ ఎఫ్ఏటీఎఫ్ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత.. ఈ విషయంలో పాక్ ఎంతమేరకు పురోగతి సాధించిందో తెలుసుకునేందుకు ఎఫ్ఏటీఎఫ్ తరచూ సమీక్షలు జరిపింది. గ్రే లిస్ట్‌లో ఉండటంవల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB), యూరోపియన్ యూనియన్ నుండి సహాయం పొందడం పాకిస్తాన్ కష్టంగా మారింది. ఇస్లామాబాద్‌కు ఏదైనా డబ్బు ఇవ్వడానికి ముందు ఈ సంస్థలు అదనపు తనిఖీలను అమలు చేయడంతో ఆ దేశ ద్రవ్యోల్బణం, మౌలిక సదుపాయాల సంబంధిత సమస్యలను మరింత తీవ్రతరం చేసింది.

తాగా.. మనీలాండరింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో పాక్ మంచి పురోగతి సాధించడంతో ఆ దేశాన్ని గ్రే లిస్ట్‌ నుంచి తొలగించినట్టు పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తాజాగా ప్రకటించింది. ఈ చర్యను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వాగతించారు. పాకిస్థాన్ ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే జాబితా నుండి నిష్క్రమించడం సంవత్సరాలుగా మా నిరంతర ప్రయత్నాలకు నిదర్శనం అన్నారు. ఈ విజయానికి కృషి చేసిన అన్ని సంస్థలను నేను అభినందించాలనుకుంటున్నానని పాక్ ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.