Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭ను అనర్హుడిగా ప్రకటించిన ఎన్నికల సంఘం

ఇమ్రాన్ ఖాన్‭కు సంబంధించిన ఈ టోషఖానా కేసుపై కొంత కాలంగా విచారణ చేపట్టిన పాకిస్తాన్ ఎన్నికల సంఘం శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. స్థానిక రాజ్యాంగంలోని ఆర్టికల్ 63(1) ప్రకారం.. ఐదేళ్ల పాటు ప్రావిన్షియల్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఇమ్రాన్ అనర్హుడని ప్రకటించింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాళీ చేసే స్థానంలో ఎన్నిక నిర్వహణకు కూడా అనుమతి ఇచ్చింది.

Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭ను అనర్హుడిగా ప్రకటించిన ఎన్నికల సంఘం

Imran Khan disqualified in Toshakhana reference

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‭కు దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను పాకిస్తాన్ ఎన్నికల సంఘం తాజాగా అనర్హుడిగా ప్రకటించింది. కారణం, ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇతర దేశాధినేతలు, విదేశీ ప్రముఖుల నుంచి అందుకున్న ప్రభుత్వ బహుమతులను చట్టవిరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే దీనికి సంబంధించిన వివరాల్ని ప్రకటించడంలో ఇమ్రాన్ విఫలం కావడంతో ఈ వేటు పడింది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇమ్రాన్ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు.

ఇమ్రాన్ ఖాన్‭కు సంబంధించిన ఈ టోషఖానా కేసుపై కొంత కాలంగా విచారణ చేపట్టిన పాకిస్తాన్ ఎన్నికల సంఘం శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. స్థానిక రాజ్యాంగంలోని ఆర్టికల్ 63(1) ప్రకారం.. ఐదేళ్ల పాటు ప్రావిన్షియల్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఇమ్రాన్ అనర్హుడని ప్రకటించింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాళీ చేసే స్థానంలో ఎన్నిక నిర్వహణకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ లాయర్లలో ఒకరైన గోహర్ ఖాన్ మాట్లాడుతూ ‘‘ఇమ్రాన్ ఖాన్ అవినీతికి పాల్పడినట్లు రుజువైంది. ఐదేళ్ల పాటు ఆయనపై అనర్హత వేటు వేశారు. అయితే ఎన్నికల సంఘమేమీ కోర్టు కాదు. మేము దీనిని ఇస్లామాబాద్ హైకోర్టులో సవాల్ చేస్తాం’’ అని అన్నారు.

Jammu And Kashmir: రాళ్లు రువ్వే యువత ఇప్పుడు సర్పంచ్‭లు అవుతున్నారు.. అమిత్ షా

ఎన్నికల కమిషన్ ప్రకటన వెలువడిన వెంటనే పీటీఐ ఉపాధ్యక్షుడు ఫవద్ చౌదరి ఘాటుగా స్పందించారు. హక్కులను కాపాడుకోవడం కోసం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తిరస్కరించాలని ప్రజలను కోరారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు వేసే దమ్ము ఎవరికీ లేదని చెప్పారు. దర్యాప్తునకు ఖాన్ సహకరిస్తున్నారని చెప్పారు.

తోషాఖానా బహుమతులు, వాటి అమ్మకాల వల్ల వచ్చిన సొమ్ము వివరాలను ఇమ్రాన్ ఖాన్ తెలియజేయడం లేదని ప్రస్తుత ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. నేషనల్ అసెంబ్లీ స్పీకర్ రజా పర్వేజ్ ఈ కేసును చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రజాకు నివేదించారు. ఇదిలావుండగా, ఎన్నికల కమిషన్ నోటీసులపై ఇమ్రాన్ ఖాన్ సెప్టెంబరులో స్పందించారు. తాను ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో విదేశీ నేతల నుంచి స్వీకరించిన బహుమతుల్లో నాలుగింటిని అమ్మేసినట్లు అంగీకరించారు. వీటిని 21.56 మిలియన్ పాకిస్థానీ రూపాయలను చెల్లించి ఖజానా నుంచి తీసుకున్నానని, వీటిని అమ్మగా 58 మిలియన్ పాకిస్థానీ రూపాయలు వచ్చిందని తెలిపారు.

Swamy Goud: కమలానికి షాక్.. బీజేపీకి మరో నేత గుడ్‌బై.. టీఆర్ఎస్‌లో చేరనున్న స్వామి గౌడ్!