Jammu And Kashmir: రాళ్లు రువ్వే యువత ఇప్పుడు సర్పంచ్‭లు అవుతున్నారు.. అమిత్ షా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకున్న అనేక నిర్ణయాలు ఈ మార్పుకు కారణం అయ్యాయని అమిత్ షా అన్నారు. దేశంలోని అనేక కల్లోల ప్రాంతాలు నేడు ప్రశాంతంగా ఉన్నాయని, అందుకు తాను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుందని, శతాబ్దపు ఉత్సవాల నాటికి ప్రపంచానికి దిక్సూచిగా భారత్‭ను నిలిపేందుకు కృషి చేయాలని, అందుకు దేశ ప్రజలంతా సహకరించాలని అమిత్ షా అన్నారు.

Jammu And Kashmir: రాళ్లు రువ్వే యువత ఇప్పుడు సర్పంచ్‭లు అవుతున్నారు.. అమిత్ షా

Positive change in India's internal security in J and K says Amit Shah

Jammu And Kashmir: ఇంతకు ముందు జమ్మూ కశ్మీర్‭లో యువత చేతిలో రాళ్లు ఉండేవని, ఎప్పుడు అల్లర్లతో రాళ్లు రువ్వుతూ ఉండేవారని, కానీ ప్రస్తుతం వాళ్లు సర్పంచ్‭లు అవుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్‭లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, రానున్న రోజుల్లో మరిన్ని ఉత్తమమైన మార్పులు వస్తాయని ఆయన అన్నారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘కొద్ది సంవత్సరాలుగా జమ్మూ కశ్మీర్‭లోని అంతర్గత భద్రతలో కొన్ని సకారాత్మక మార్పులు వచ్చాయి. గతంలో ఈశాన్య రాష్ట్రాలు సహా జమ్మూ కశ్మీర్‭లో కొన్ని భయానక పరిస్థితులు ఉండేవి. ఉగ్రవాదం, నక్సలిజం లాంటివి చాలా పెద్ద ఎత్తున ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాల్లో 70 శాతం మార్పు వచ్చింది. ఇక జమ్మూ కశ్మీర్‭లో కూడా అలాంటి మార్పు స్పష్టంగానే కనిపిస్తోంది. ఇంతకు ముందు రాళ్లు రువ్విన యువత నేడు సర్పంచ్‭లుగా అవుతున్నారు’’ అని అమిత్ షా అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకున్న అనేక నిర్ణయాలు ఈ మార్పుకు కారణం అయ్యాయని అమిత్ షా అన్నారు. దేశంలోని అనేక కల్లోల ప్రాంతాలు నేడు ప్రశాంతంగా ఉన్నాయని, అందుకు తాను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుందని, శతాబ్దపు ఉత్సవాల నాటికి ప్రపంచానికి దిక్సూచిగా భారత్‭ను నిలిపేందుకు కృషి చేయాలని, అందుకు దేశ ప్రజలంతా సహకరించాలని అమిత్ షా అన్నారు.

Swamy Goud: కమలానికి షాక్.. బీజేపీకి మరో నేత గుడ్‌బై.. టీఆర్ఎస్‌లో చేరనున్న స్వామి గౌడ్!