Zakir Naik: ఫిఫా వరల్డ్ కప్‌లో జకీర్ నాయక్… మత బోధనల కోసం ఆహ్వానించిన ఖతార్

దేశంలో నిషేధానికి గురైన ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ప్రస్తుతం ఖతార్‌లో కనిపించాడు. అక్కడ జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్ కప్-2022’ సందర్భంగా ఇస్లాంకు సంబంధించి పలు బోధన కార్యక్రమాల్లో జకీర్ పాల్గొనబోతున్నాడు.

Zakir Naik: ఫిఫా వరల్డ్ కప్‌లో జకీర్ నాయక్… మత బోధనల కోసం ఆహ్వానించిన ఖతార్

Zakir Naik: వివిధ ఆరోపణల నేపథ్యంలో ఇండియా నుంచి పారిపోయిన ముస్లిం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఖతార్‌లో కనిపించాడు. అక్కడ జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్ కప్-2022’ సందర్భంగా నిర్వహించే పలు కార్యక్రమాల్లో జకీర్ పాల్గొనబోతున్నాడు.

Uttar Pradesh: శ్రద్ధా హత్య తరహాలో యూపీలో మరో ఘటన.. మహిళను చంపి ఆరు ముక్కలుగా నరికిన మాజీ ప్రియుడు

మనీ లాండరింగ్‌తోపాటు విద్వేష పూరిత ప్రసంగాలు చేశాడని జకీర్‌పై ఆరోపణలున్నాయి. మత బోధనల పేరుతో యువతను రెచ్చగొట్టడం, హింస వైపు నడిపించడం, ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడ్డట్లుగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. పీస్ టీవీ నెట్‌వర్క్ ద్వారా ఆయన తన ప్రచారం నిర్వహించేవాడు. జకీర్ బోధనల ద్వారా ఎంతోమంది యువత తప్పుడు బాట పడుతున్నారని కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయన సంస్థలపై 2016లో కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత జకీర్ దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం మలేసియాలో ఉంటున్నారు. జకీర్‌ను ఇండియా తీసుకొచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆయనను ఖతార్ తమ దేశం రావాలని ఆహ్వానించింది.

Zomato layoffs: కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు… ఇప్పుడో జొమాటో వంతు

అక్కడ ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ఇస్లాం బోధనలు చేయాలని సూచించింది. దీంతో జకీర్ ప్రస్తుతం ఖతార్ చేరుకున్నాడు. టోర్నీ జరిగేంతకాలం ఆయన వివిధ మంత సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అయితే, ఈ విషయంలో ఇండియా ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, గతంలో ఇస్లాంకు వ్యతిరేకంగా నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఖతార్ ఘాటుగా స్పందించింది. ఇండియా ఈ విషయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. అలాంటిది ఇండియా నిషేధం విధించిన జకీర్‌ను ఖతార్ ఆహ్వానించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.