UK Economic Crisis: యూకేలో ఆర్థిక సంక్షోభం.. ఖర్చులు తగ్గించుకునేందుకు పస్తులుంటున్న ప్రజలు..

యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టిన తరువాత కొద్దిరోజులకే మినీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ మినీ బడ్జెట్ కారణంగా మార్కెట్లు కుదేలయ్యాయి. డాలర్ తో పోలిస్తే పౌండ్ రికార్డు కనిష్టానికి పడిపోయింది.

UK Economic Crisis: యూకేలో ఆర్థిక సంక్షోభం.. ఖర్చులు తగ్గించుకునేందుకు పస్తులుంటున్న ప్రజలు..

UK In Economic Crisis

UK Economic Crisis: యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టిన తరువాత కొద్దిరోజులకే మినీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ మినీ బడ్జెట్ కారణంగా మార్కెట్లు కుదేలయ్యాయి. డాలర్ తో పోలిస్తే పౌండ్ రికార్డు కనిష్టానికి పడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. సొంత పార్టీ ఎంపీల నుంచి లిజ్ ట్రస్ తీవ్రవిమర్శలు ఎదుర్కోవటంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

UK PM Liz Truss: ఆ తప్పులకు నన్ను క్షమించండి.. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్

ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టిన తరువాత బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోటుందని కన్జూమర్ గ్రూప్ విజ్ పేర్కొంది. మూడువేల మందిపై చేసిన సర్వేలో అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిజ్ ట్రస్ ప్రధాని అయిన తరువాత అక్కడ విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయడంతో రానున్న కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకొనేందుకు బ్రిటన్ వాసులు భోజనాలను తగ్గించుకుంటున్నారని ఆ సర్వేలో వెల్లడయింది. సెప్టెంబర్ నెలలో యూకేలో ద్రవ్యోల్బనం 10శాతాని కన్నా ఎక్కువ కావటంతో ఆహార ధరలు విపరీతంగా పెరిగాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

యూకే వాసుల్లో సగం మంది భోజనాల ఖర్చును తగ్గించుకున్నారని కన్జూమర్ గ్రూప్ విజ్ పేర్కొంది. సంక్షోభం ముందుతో పోలిస్తే ప్రస్తుతం ఆ దేశంలో 80శాతం మంది ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. మినీ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో లిజ్ ట్రస్ ఆర్థిక మంత్రి క్యాజీ కార్టెంగ్ ను తప్పించి జెరెమీ హంట్ ను నియమించారు. మరోవైపు సొంత పార్టీ ఎంపీలే ఆమెపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో భారత సంతతి మూలాలున్న బ్రిటన్ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మన్ తన పదవికి రాజీనామా చేశారు.