UK PM Liz Truss: ఆ తప్పులకు నన్ను క్షమించండి.. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్

బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ క్షమాపణలు చెప్పారు. గత నెల మినీ బడ్జెట్‌లో ఆర్థిక చర్యల ప్రకటన మార్కెట్లను భయాందోళనలకు గురిచేసిన తర్వాత ఆమె ప్రభుత్వం "తప్పులు చేసిందని" అంగీకరించింది. కానీ నేను తప్పులను సరిదిద్దుతానని ఆమె చెప్పింది.

UK PM Liz Truss: ఆ తప్పులకు నన్ను క్షమించండి.. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్

UK PM liz truss

UK PM Liz Truss: బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ క్షమాపణలు చెప్పారు. గత నెల మినీ బడ్జెట్‌లో ఆర్థిక చర్యల ప్రకటన మార్కెట్లను భయాందోళనలకు గురిచేసిన తర్వాత ఆమె ప్రభుత్వం “తప్పులు చేసిందని” అంగీకరించింది. ఈ మేరకు ఆమె అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మనం తప్పులు చేశామని ఇప్పుడు నేను గుర్తించాను. ఆ తప్పులకు నన్ను క్షమించండి, కానీ నేను తప్పులను సరిదిద్దుతానని ఆమె చెప్పింది. కొత్త ఛాన్సలర్‌ని నియమించాము, మేము ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణను పునరుద్దరిస్తామని తెలిపారు.

Liz Truss -Rishi Sunak : లిజ్ ట్రస్‌పై సొంతపార్టీలోనే వ్యతిరేకత .. రిషి సునాక్ బ్రిటన్ పీఎం అవుతారంటూ వస్తున్న వార్తలు నిజమవుతాయా?

నేను ఈ దేశంకోసం పనిచేయడానికి ఎన్నుకోబడినందున ఆ పనిని కొనసాగిస్తాను. అదే నేను చేయాలని నిశ్చయించుకున్నాను అంటూ ట్రస్ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మీరు పేరుకు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు.. అలాంటిదేమీలేదు.. దిశను మార్చాలని తనకు తెలుసు, కాబట్టి కొత్త ఆర్థికమంత్రి జెరెమీ హంట్ నియమించినట్లు చెప్పారు. అయితే, తాను విజన్‌కి కట్టుబడి ఉన్నానని, కొత్త వ్యూహంతో ప్రభుత్వ విధానంపై ఎవరు నియంత్రణలో ఉన్నారనే ప్రశ్నలు ఉన్నప్పటికీ తాను అనుకున్నది చేస్తానంటూ ట్రస్ స్పష్టం చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోవైపు, సొంతపార్టీ కన్సర్వేటివ్‌ సభ్యుల సలహాలతో కొత్త ఆర్థికమంత్రి జెరెమీ హంట్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆదాయపు పన్ను సహా ఇతర పన్నులను కత్తిరిస్తూ.. లిజ్‌ ట్రస్‌ సెప్టెంబర్‌ 23న తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నారు. తద్వారా స్టాక్‌మార్కెట్లను, IMF వంటి సంస్థలను శాంతపరిచే చర్యలు చేపట్టారు.