Solar Eclipse : 2022లో తొలి సూర్యగ్రహణం రేపే.. ఇండియాలో చూడొచ్చా..?

Solar Eclipse 2022 : 2022లో సూర్యగ్రహణం ఏప్రిల్ 30 (శనివారం) ఏర్పడనుంది. ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం.. దీన్ని తొలి పాక్షిక సూర్యగ్రహణంగా పిలుస్తారు. అలాగే మే 16న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

Solar Eclipse : 2022లో తొలి సూర్యగ్రహణం రేపే.. ఇండియాలో చూడొచ్చా..?

First Partial Solar Eclipse Of 2022 Today, Will Not Be Visible In India; How To Watch Online

Solar Eclipse 2022 : 2022లో సూర్యగ్రహణం ఏప్రిల్ 30 (శనివారం) ఏర్పడనుంది. ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం.. దీన్ని తొలి పాక్షిక సూర్యగ్రహణంగా పిలుస్తారు. అలాగే మే 16న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ రెండు ఖగోళ దృగ్విషయాలలో ఏదీ కూడా భారతదేశంలో కనిపించదు. ఏప్రిల్ 30 పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అమెరికాలోని దక్షిణ నైరుతి భాగాలు, పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాలు అంటార్టికాలోని చాలా భూభాగాల్లో మాత్రమే కనిపిస్తుంది. సూర్యాస్తమయానికి కొద్ది వ్యవధి వరకు ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడవచ్చునని నాసా వెల్లడించింది. ఆకాశం నిర్మలంగా ఉన్న సమయంలో మాత్రమే సూర్య గ్రహణాన్ని చూడటం వీలువుతుంది.

అర్జెంటీనీ, నైరుతి బొలీవియా, ఈశాన్యలోని పెరూ, చిలీ, ఉరుగ్వే, పశ్చిమ పర్వాగ్వే, నైరుతి బ్రెజిల్‌ దేశాలలో సూర్యాస్తమయం సమయంలో మాత్రమే గ్రహణం కనిపిస్తుందని నాసా తెలిపింది. శనివారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం 12.15 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభం కానుంది. మే 1 తెల్లవారుజామున 4.07 గంటలకు గ్రహణం ముగుస్తుంది.

భారతదేశంలో ఈ సమయం రాత్రి కావునా సూర్య గ్రహణాన్ని చూడలేరు. ఇక, చంద్రగ్రహణం మే 16, 2022న పగటిపూట ఏర్పడుతుంది. ఉదయం 7.02 గంటలకు ప్రారంభమవుతుంది మొత్తం గ్రహణం ఉదయం 7.57 గంటలకు ప్రారంభమవుతుంది. చంద్రుడు భూమి, నీడ లోతైన భాగంలో ఉన్నప్పుడు గరిష్ట గ్రహణం ఉదయం 9.41 గంటలకు ఉంటుంది. సంపూర్ణ గ్రహణం ఉదయం 10.23 గంటలకు ముగుస్తుంది. గ్రహణం పాక్షిక దశ ఉదయం 11.25 గంటలకు ముగుస్తుంది.

First Partial Solar Eclipse Of 2022 Today Will Not Be Visible In India How To Watch Online

First Partial Solar Eclipse Of 2022 Today Will Not Be Visible In India How To Watch Online

ఆన్‌లైన్‌లో ఎలా చూడాలంటే :
ఖగోళ దృగ్విషయం కనిపించని ప్రాంతాలలోని ప్రజలు సూర్యగ్రహాణాన్ని ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు. YouTube ఛానెల్‌లు తమ సంబంధిత ఛానెల్‌లలో ఈ సూర్యగ్రహాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.

ఎక్కడ చూడవచ్చు? :
ఈ గ్రహణం, సంపూర్ణంగా లేదా పాక్షిక దశలలో ఐరోపా, ఆసియాలోని దక్షిణ పశ్చిమ ప్రాంతాలలో, ఉత్తర అమెరికాలోని ఆఫ్రికా పెద్ద భాగాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ హిందూ మహాసముద్ర ప్రాంతాలు అంటార్కిటికాలోని కొన్ని భాగాలలో చూడవచ్చు.

తదుపరి సూర్యగ్రహణం ఎప్పుడు ఉంటుంది?
తదుపరి పాక్షిక సూర్యగ్రహణం అక్టోబర్ 25న, పాక్షిక చంద్రగ్రహణం నవంబర్ 8న సంభవిస్తుంది ఈ రెండూ భారతదేశంలోనూ కనిపిస్తాయి. భారత్‌లోని ప్రజలు అక్టోబర్ 25న సూర్యాస్తమయానికి ముందు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడగలరు.

సూర్యగ్రహణం అంటే ఏమిటి? :
సూర్యగ్రహణం అంటే.. భూమి.. సూర్యునికి మధ్య వచ్చినప్పుడు అమావాస్య రోజున సంభవిస్తుంది. అది కొంత కాలం పాటు సూర్యుడిని భూమి నుంచి పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుకుంటుంది.

చంద్రగ్రహణం అంటే ఏమిటి?
విశ్వ ఉపగ్రహం.. భూమి నీడ గుండా వెళుతున్నప్పుడు పౌర్ణమి రాత్రి చంద్రగ్రహణం సంభవిస్తుంది.

Read Also : Solar Eclipse : ఆకాశంలో మరో అద్భుతం, డిసెంబర్ 04న సూర్యగ్రహణం