Forbes Most Powerful Women:ఫోర్బ్స్ లిస్టులో శక్తివంతమైన మహిళలుగా నిర్మలా సీతారామన్‌..కిరణ్ మజుందార్-షా,రోషిణి నాడార్

  ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఈ బాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారతీయ వ్యాపారవేత్తలు కిరణ్ మంజుదార్ షా, రోషిణి నాడార్

Forbes Most Powerful Women:ఫోర్బ్స్ లిస్టులో శక్తివంతమైన మహిళలుగా నిర్మలా సీతారామన్‌..కిరణ్ మజుందార్-షా,రోషిణి నాడార్

Forbes Most Powerful Women (1)

Forbes Most Powerful Women:  ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఫోర్బ్స్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడవ సారి చోటు దక్కించుకోవటం గమనించాల్సిన విషయం.

Read more :  Forbes list :ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు..6వ స్థానంలో జయశ్రీ ఉల్లాల్

2021 ఏడాదిలో మంత్రి నిర్మలా సీతారామన్ ర్యాంకింగ్ 37కి పెరిగింది. నిర్మలా అమెరికన్ కౌంటర్ జానెట్ యెల్లెన్ కంటే రెండు స్థానాలు ముందుండటం మరో విశేషం. సంత్సరం క్రితం నిర్మలమ్మ 41 స్థానంలో ఉండగా..ఈ ఏడాది ఆ స్థానాన్ని మరింతగా మెరుగుపరుచుకుని 37 స్థానాన్ని దక్కించుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు..భారత సంతతి మహిళ కమలా హారిస్‌ రెండో స్థానంలో నిలిచారు.అలాగే ఫోర్బ్స్‌ 100మంది జాబితాలో భారతీయ వ్యాపారవేత్తలు HCL టెక్నాలజీస్ చైర్‌పర్సన్..భారతదేశంలో లిస్టెడ్ IT కంపెనీకి నాయకత్వం వహించిన మొదటి మహిళ.. రోషిణి నాడార్ 52 స్థానాన్ని దక్కించుకోగా..బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా 72 స్థానంలో నిలిచారు.

Read more : Ajaita shah : అజైత‌ షా..ఇ-కామర్స్‌తో దాణా వ్యాపారాన్ని జత చేసిన ఆంట్రప్రెన్యూర్

అత్యంత శక్తివంతమైన మహిళల మొదటి స్థానంలో యూఎస్ కు చెందిన మెకెంజీ స్కాట్ మొదటి స్థానంలో నిలిచారు. 3వస్థానంలో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టీన్ లగార్డ్,యూఎస్ కు చెందిన మేరీ బర్రా 4వ స్థానంలో, యూఎస్ కు చెందిన మరో మహిళ మెలిండా ఫ్రెంచ్ గేట్స్ 5స్థానంలో నిలిచారు. యూఎస్ కు చెందిన అబిగైల్ జాన్సన్ 6స్థానంలో నిలవగా..స్పెయిన్ కు చెందిన అనా ప్యాట్రిసియా బోటిన్ 7 స్థానంలోను..జర్మనీకి చెందిన ఉర్సులా వాన్ డెర్ లేయెన్ 8 స్థానాలను దక్కిచుకున్నారు. అలాగే తైవాన్ కు చెందిన సాయ్ ఇంగ్-వెన్ 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే యూఎస్ కు చెందిన జూలీ స్వీట్ 10వ స్థానంలో నిలిచారు.

Read more : 6 richest women : భారత్ లో ధనిక మహిళలు..ఫస్ట్ ప్లేస్ లో సావిత్రి జిందాల్

కాగా.. భారత్‌ నుంచి Nykaa వ్యవస్థాపకురాలు, CEO ఫల్గుణి నాయర్ 88వ స్థానంలో నిలిచిన ఆమె ఇటీవలే భారతదేశం ఏడవ మహిళా బిలియనీర్ గా నిలిచారు. స్టాక్ మార్కెట్‌లో తన కంపెనీ స్టార్ అరంగేట్రం తర్వాత అత్యంత సంపన్నమైన బిలియనీర్ గా మారారు. కాగా.. ఈ సంవత్సరం ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న మెకెంజీ స్కాట్ తన సంపదలో $8.6 బిలియన్లను దాతృత్వంతో పెద్ద మనస్సు చాటుకున్నాడు.