Elon Musk : 2023లో ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారు : రష్యా మాజీ అధ్యక్షుడు

2023లో ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారు అంటూ చెప్పుకొచ్చారు రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వ్‌దేవ్.

Elon Musk : 2023లో ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారు : రష్యా మాజీ అధ్యక్షుడు

Elon Musk US president say Dmitry Medvedev

Elon Musk : ఎలాన్ మస్క్..ప్రపంచం అంతా మారుమోగిపోతున్న పేరు. పరిచయం అవసరం లేని మేధావి. ఈ మేధావి చేసే సంచలనాలు అన్నీ ఇన్నీకావు. ఏం చేసినా ఎలన్ మస్క్ (Elon Musk)వార్తల్లోనే ఉంటారు. టెస్లా (tesla)మస్క్ మస్క్ అంటే టెస్లా అని పేరు తెచ్చుకున్న ఈ మేధావి ప్రజల మెదళ్లలో చిప్ పెడతానన్నా..అదో పెను సంచలనమే..అటువంటి ఎలన్ మస్క్ అమెరికా ప్రెసిడెంట్ అయితే ఎలా ఉంటుంది? మేధావి దేశాధ్యక్షుడు అయితే ఆ ప్రజలకు మరింత మేలు కలుగుతుందా? అయినా ఈ ఇవన్నీ ఎందుకంటారా? ‘అమెరికాలో అంతర్యుద్దం తప్పదని..ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు అయితీరతారని చెబుతున్నారు రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వ్‌దేవ్ (Dmitry Medvedev).

2023లో ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారని చెబుతున్నారు దిమిత్రి. అమెరికాలో వచ్చే ఏడాది అంటే 2023లో అంతర్యుద్ధం చెలరేగుతుందని ఎలన్ మస్క్ అధ్యక్షుడు అవుతారని ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత సన్నిహితుడు,పుతిన్ అడ్వైజరీ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ హెడ్, రష్యా మాజీ రష్యా అధ్యక్షుడు దిమిత్రి మోద్వ్ దేవ్ అంచనా వేశారు. అంతేకాదు ఈ అంతర్యుద్ధంలో టెక్సాస్, కాలిఫోర్నియాలు విడిపోయి స్వతంత్ర రాష్ట్రాలుగా ఏర్పాడతాయని..టెక్సాస్, మెక్్సికో మిత్ర రాజ్యంగా ఏర్పడతాయని కూడా దిమిత్రి తెలిపారు.

దిమిత్రి మెద్వ్‌దేవ్ 2008 నుంచి 2012 వరకు రష్యా అధ్యక్షుడిగాను, 2012 నుంచి 2020 వరకు ప్రధానిగా పనిచేశారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆంతరంగికుడిగా, రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న మెద్వ్‌దేవ్ తాజాగా కొత్త సంవత్సరంలో జరగబోయే కీలక పరిణామాలపై తన అంచనాలను వెల్లడించారు.

దిమిత్రి అంచనాల ప్రకారం..2023లో అమెరికాలో అంతర్యుద్ధం మొదలవుతుంది. ఫలితంగా రాష్ట్రాలు విడిపోతాయి. కాలిఫోర్నియా, టెక్సాస్‌లు స్వతంత్ర రాజ్యాలు అవుతాయి. ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికాకు అధ్యక్షుడు అవుతారు. ఐఎంఎప్, ప్రపంచ బ్యాంకు పతనమవుతాయి. బ్రిటన్ తిరిగి యూరోపియన్ యూనియన్‌ (ఈయూ)లో చేరుతుంది. ఆ తర్వాత ఈయూ కూడా కుప్పకూలుతుందని మెద్వ్‌దేవ్ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంకు US డాలర్,యూరోలకు ముగింపు పలకడానికి ముందు US మరియు యూరోప్‌లోని స్టాక్ మార్కెట్ ఆసియాకు మారుతుందని మెద్వెదేవ్ చెప్పుకొచ్చారు.