పాకిస్తాన్ లో రూ. 10 కోట్లతో శ్రీకృష్ణుడి దేవాలయం..భూమి పూజ కూడా జరిగింది

10TV Telugu News

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో  మొట్టమొదటి హిందూ దేవాలయానికి పునాది రాయి వేయబడింది. ఇస్లామాబాద్ లోని H-9 ఏరియా లో  10 కోట్ల రూపాయలతో  శ్రీకృష్ణుడి ఆలయాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్మిస్తోంది. 20 వేల చదరపు అడుగుల స్థలంలో నిర్మిస్తున్న ఈ ఆలయానికి పార్లమెంటరీ మానవ హక్కుల సంఘం కార్యదర్శి లాల్ చంద్ మల్హి మంగళవారం భూమిపూజ చేశారు.

ఈ ఆలయ స్థలాన్ని కేపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ 2017లోనే  హిందూ పంచాయత్‌కు అప్పగించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆలయ నిర్మాణం పనుల్లో జాప్యం జరుగుతూ  వచ్చింది.  కొత్తగా నిర్మించబోయే ఆలయానికి శ్రీ కృష్ణ మందిర్ అని ఇస్లామాబాద్ హిందూ పంచాయత్ పేరు పెట్టింది. 

గత రెండు దశాబ్దాల్లో ఇస్లామాబాద్‌లో హిందువుల జనాభా గణనీయంగా పెరిగిందని లాల్ చంద్ మల్హి తెలిపారు. పాక్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులకు స్మశానవాటిక లేదనే వాదనలను ఆయన తోసిపుచ్చారు. ఇక కొత్తగా నిర్మించబోయే ఆలయ కాంప్లెక్స్‌లో స్మశాన వాటిక ఉంటుందని తెలిపారు. 

సాయిద్పూర్ గ్రామం మరియు రావల్ సరస్సు సమీపంలో కోరాంగ్ నదికి ఎదురుగా ఉన్న కొండ పాయింట్ దగ్గర ఉన్న ఆలయాలతో కలిపి 1947 కి పూర్వం ఇస్లామాబాద్, దాని పరిసర ప్రాంతాలలో అనేక ఆలయ నిర్మాణాలు ఉన్నాయని,అయినప్పటికీ, అవి వదలివేయబడ్డాయి మరియు ఉపయోగించబడలేదు అని  లాల్ చంద్ మల్హి తెలిపారు. 

Read: 9 ఏళ్లు తపస్సు చేసి..35మందితో కలిసి హిందువుగా మారిన ముస్లిం యువకుడు