జపాన్‌తో పాటు ఫ్రాన్స్‌లోనూ కొత్త కరోనా వైరస్ కేసులు

జపాన్‌తో పాటు ఫ్రాన్స్‌లోనూ కొత్త కరోనా వైరస్ కేసులు

Coronavirus: న్యూ కరోనా వైరస్ వేరియంట్ బ్రిటన్ దాటేసింది. శుక్రవారం రాత్రికి జపాన్‌లో తొలి కేసు నమోదుకాగా, ఫ్రాన్స్ లోనూ మొదటి కేసు కన్ఫామ్ అయినట్లు అక్కడి నేషనల్ హెల్త్ మినిస్ట్రీ చెబుతుంది. లక్షణాలు కనిపించకపోయినప్పటికీ ఆ వ్యక్తిని ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంచారు.

హెల్త్ అథారిటీలు కాంటాక్ట్ ట్రేసింగ్ నుంచి సేఫ్ చేసి పేషెంట్ కేర్ తీసుకోవాలని చెబుతున్నారు. నియమాలు విస్మరించి అతనితో ఎవరైనా కాంటాక్ట్ లో ఉన్నారని తెలిస్తే వారిని కూడా ఐసోలేషన్ కు పంపిస్తామని చెబుతున్నారు. తొలి కేసుతో పాటు మరిన్ని పాజిటివ్ శాంపుల్స్ సేకరించారు.

వీటన్నిటిలో VOC 202012/01 వేరియంట్ ఉన్నట్లుగా నేషనల్ ప్యాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన ల్యాబొరేటరీ స్పెషలిస్ట్ గుర్తించారు. ఇదే వారం యూకే నుంచి Coronavirus వ్యాప్తి కాకుండా బోర్డర్స్ అన్నింటినీ క్లోజ్ చేసింది ఫ్రాన్స్. కేవలం ఫ్రాన్స్ పౌరులను మాత్రమే తిరిగి సొంత గ్రామాలు వచ్చేందుకు అనుమతిచ్చింది.

ఫ్రాన్స్ ఇంటీరియర్ మినిస్ట్రీ గురువారం యూకేలో ట్రావెల్ పై ఉన్న పరిమితులను కనీసం జనవరి 6 వరకైనా కంటిన్యూ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లేదా ఈయూకు చెందిన సిటిజన్లు లేదా వ్యాపారాలు చేసుకునే వారు మాత్రమే యూకే దాటి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. మూడు రోజుల క్రితం చేయించుకున్న పరీక్షల్లో కొవిడ్ నెగెటివ్ వచ్చిన వారికి కూడా నో ఎంట్రీ చెప్తున్నారు.

కొత్త వైరస్ గురించి గత వారమే తొలిసారిగా డిక్లేర్ చేసింది యూకే గవర్నమెంట్. మరోవైపు ఈ వైరస్ పాత Coronavirus కంటే 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు అంటున్నారు. శుక్రవారానికి కొత్త Coronavirus యూకే, జపాన్, ఫ్రాన్స్‌తో పాటు మొత్తం 8 యూరప్ దేశాల్లో వైరస్ నమోదైనట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది.