Israel-Gaza Conflict : గాజాలో బాంబుల వర్షం.. ఉగ్రవాదులు హతమయ్యేవరకు దాడులు ఆపబోం..

ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లు ప్రయోగించారు. అయితే హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టే వరకు దాడులు ఆపబోమని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.

Israel-Gaza Conflict : గాజాలో బాంబుల వర్షం.. ఉగ్రవాదులు హతమయ్యేవరకు దాడులు ఆపబోం..

Israel Gaza Conflict

Israeli PM Netanyahu : ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లు ప్రయోగించారు. అయితే హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టే వరకు దాడులు ఆపబోమని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.

ఇజ్రాయెల్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు. తాము జరిపిన దాడుల్లో హమాస్ ఉగ్రవాదులు భారీగా చనిపోయారని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల స్థావరాలు, వారి నేతల భవనాలే టార్గెట్‌గా దాడులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన రాకెట్ దాడుల్లో గాజాలో ఇప్పటి వరకు 42 మంది చనిపోయారు. ఇందులో 16 మంది మహిళలు, పది మంది చిన్నారులు ఉన్నారు. ఇక ఇజ్రాయెల్‌లో కూడా ప్రాణనష్టం సంభవించింది. ఇద్దరు చిన్నారులతో పాటు మరో పది మంది ప్రాణాలు కోల్పోయారు.

గాజాలో మొత్తం 188 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 వందల 30 మంది గాయపడ్డారని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ దాడులను ఆపేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం నిర్వహించింది. మధ్యవర్తుల ద్వారా ఇరు వర్గాలతో మాట్లాడి దాడులు ఆపే ప్రయత్నం చేయాలని నిర్ణయించింది. వెంటనే దాడులు ఆపాలని ఇరు వర్గాలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాలస్తీనాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనాల శిథిలాల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేస్తున్నారు.