Global Markets: యుద్ధం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్!

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అన్నట్టుంది ఉంది గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్ల పరిస్థితి. రష్యా-యుక్రెయిన్‌ మధ్య మొదలైన యుద్ధం.. గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Global Markets: యుద్ధం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్!

Yuddham

Global Markets: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అన్నట్టుంది ఉంది గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్ల పరిస్థితి. రష్యా-యుక్రెయిన్‌ మధ్య మొదలైన యుద్ధం.. గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో కుప్పకూలిన గ్లోబల్ మార్కెట్లు.. యుద్ధం మొదలవ్వడంతో ఇన్వెస్టర్ల సంపదను అమాంతం ఆవిరి చేసేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లన్నంటినీ రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం కమ్మేసింది. చైనా, సౌత్ కొరియా, హాంకాంగ్‌, సింగపూర్‌, జపాన్‌, చైనా, తైవాన్‌తో పాటు అమెరికా, యూరప్ మార్కెట్లను ముంచుతున్నాయి. స్టాక్‌ మార్కెట్లలో రష్యా-యుక్రెయిన్‌ యుద్ధ ఓ పెద్ద సునామీనే సృష్టించింది. మాములుగా యుద్ధం.. ఉద్రిక్తతలు.. ఏదైనా అనిశ్చితి ఏర్పడిందంటే ఇన్వెస్టర్లలో భయాలు మాములుగానే పెరుగుతాయి.

యుద్ధం అనివార్యమైతే సప్లై చైన్‌కు ఆటంకాలు ఏర్పడుతాయి. ఈ భయాలతో ఇప్పటికే బ్యారెల్ చమురు ధర 100 డాలర్లకు చేరింది. ఇప్పుడు యుద్ధం ప్రారంభమవడంతో అతి త్వరలోనే 110 డాలర్లకు చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే చాలా దేశాల్లో ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అవ్వడం ఖాయం.

యూరోపియన్ దేశాలకు నేచురల్ గ్యాస్ సరఫరా చేసే అతిపెద్ద దేశం రష్యానే. చమురును ఉత్పత్తి చేసే లీడర్‌గా ఉన్న సౌదీ అరేబియాతో రష్యాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా-యుక్రెయిన్‌ మధ్య యుద్ధం జరగడం ప్రపంచ దేశాలకు మంచి సూచనైతే కాదని చెబుతున్నారు విశ్లేషకులు.

యుద్ధం అనివార్యం కావడంతో రష్యాపై అమెరికాతో సహా పలు దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ఇప్పుడు చమురు సప్లై చైన్‌ దెబ్బతినడం ఖాయం.. దీంతో ప్రస్తుతం 100కు చేరిన బ్యారెల్‌ చమురు ధర..త్వరలో 125 డాలర్లకు, 2023లో 150 డాలర్లకు చేరుకుంటాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. అటు బంగారం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే 9 నెలల గరిష్టానికి బంగారం ధర చేరింది.