Russian Traffic Cop : ఇల్లంతా బంగారం, టాయిలెట్ కూడా

రష్యాలో ఓ అవినీతి అధికారి ఉదంతం బయట పడింది. స్టావ్రోపోల్‌లో రవాణా అధికారిగా పని చేస్తున్న కల్నల్ అలెక్సీ సఫోనోవ్ ఇంటిపై అక్కడి అవినీతి నిరోదకశాఖ అధికారులు దాడులు చేశారు. అలెక్సీ ఇల్లంతా బంగారంతో పోతపోసినట్లు ఉండటం చూసి ఒక్కసారిగా అంతా షాకయ్యారు.

Russian Traffic Cop : ఇల్లంతా బంగారం, టాయిలెట్ కూడా

Gold

Gold Toilet : రష్యాలో ఓ అవినీతి అధికారి ఉదంతం బయట పడింది. స్టావ్రోపోల్‌లో రవాణా అధికారిగా పని చేస్తున్న కల్నల్ అలెక్సీ సఫోనోవ్ ఇంటిపై అక్కడి అవినీతి నిరోదకశాఖ అధికారులు దాడులు చేశారు. అలెక్సీ ఇల్లంతా బంగారంతో పోతపోసినట్లు ఉండటం చూసి ఒక్కసారిగా అంతా షాకయ్యారు. విలాసవంతమైన ఆ ఇంట్లోని చాలా వస్తువులు బంగారంతో తయారుచేసినవే. బెడ్రూమ్‌, హాలు, కిచెన్‌లోని పలు వస్తువులతోపాటు.. ఆ ఇంట్లోని టాయిలెట్‌ కూడా అలెక్సీ బంగారంతో కట్టించుకున్నాడు. అంతేకాదు దానికి మ్యాచింగ్‌గా ఫ్లోర్​ను కూడా ప్రత్యేక మార్బుల్‌తో వేయించాడు.

Read More : Kargil Vijay Diwas : వీరులారా వందనం..ఏం జరిగిందో తెలుసా

భూతల స్వర్గాన్ని తలపించే ఈ ఇంటి ముందు రెండు అత్యంత ఖరీదైన కార్లు కూడా అధికారులకు చిక్కాయి. ఇంట్లో ఉండే ఫర్నీచర్​, గోడకు ఉండే ఫ్రేమ్‌లు, కుర్చీలు, కిచెన్​లో ఉండే అల్మారాలు, అంతా బంగారంతో ధగధగలాడుతున్నాయి. ఇంటీరియర్​ డెకరేషన్​ అంతా పుత్తడితోనే ఉంది. అలెక్సీ, అతని కింద ఉండే ఆరుగురు అధికారులు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని వాహనాలకు ఫేక్​ పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Read More : రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

దీంతో ఆయా వాహనాలు స్టావ్రోపోల్‌లో ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించకుండా సరుకు రవాణా చేయవచ్చు. ఈ దందాతోనే అలెక్సీ భారీగా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. అదే కేసులో మరో 35 మంది హస్తం ఉందనే అనుమానులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో విచారణ కోసం వెళ్లిన పోలీసులు.. ఆ ఇంటిని చూసి షాకయ్యారు. ఈ ఆరోపణలు రుజువైతే అలెక్సీకి సుమారు 15ఏళ్ల జైలు శిక్ష పడుతుందని అక్కడి అధికారులంటున్నారు.