Lucky draw: అదృష్టం వరించింది.. లక్కీ డ్రాలో భారీమొత్తాన్ని గెలుచుకున్న ఇండియన్స్..

దుబాయ్‌లోని మహజూజ్ రాఫెల్‌లో ఉంటున్న ఇద్దరు భారత ప్రవాసులను అదృష్టం తలుపు తట్టింది. ఏకంగా లక్షల్లో సొమ్ము చేతిలోకొచ్చి పడింది. దీంతో వారి సంతోషానికి అవధుల్లేవు...

Lucky draw: అదృష్టం వరించింది.. లక్కీ డ్రాలో భారీమొత్తాన్ని గెలుచుకున్న ఇండియన్స్..

Lucky Arwa

Lucky draw: దుబాయ్‌లోని మహజూజ్ రాఫెల్‌లో ఉంటున్న ఇద్దరు భారత ప్రవాసులను అదృష్టం తలుపు తట్టింది. ఏకంగా లక్షల్లో సొమ్ము చేతిలోకొచ్చి పడింది. దీంతో వారి సంతోషానికి అవధుల్లేవు. ఒక్కొక్కరు భారత కరెన్సీ ప్రకారం రూ. 20.81 లక్షలు లక్కీ డ్రాలో గెలుచుకున్నారు. భారత్ నుంచి ఉపాధి నిమిత్తం వీరు దుబాయ్‌ వెళ్లారు. అక్కడే సల్ఫికర్ సేల్స్ మెన్ గా పనిచేస్తుండగా, కొచప్పన్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. తొలుత లక్కీడ్రాలో విజేతులుగా ఎంపికైనట్లు ఖాతర్ లో ఉండే తన స్నేహితుడు ఫోన్ ద్వారా తెలియజేపినట్లు సల్ఫికర్ తెలిపాడు.

Lucky Draw Cheating : లక్కీ డ్రా పేరుతో కుచ్చుటోపీ…రూ.3 కోట్లు మోసానికి పాల్పడ్డ నిర్వాహకులు

అయితే తాను నమ్మలేదని, ఏదో ఆటపట్టించడానికి ఇలా చేస్తున్నాడని అనుకున్నానని తెలిపారు. తన స్నేహితుడు నిజంగానే లక్కీడ్రా వచ్చిందని తెలపడంతో వెంటనే ఆన్ లైన్ ద్వారా రాఫల్ విజేతల వివరాలను చెక్ చేసుకున్నట్లు సల్ఫీకర్ తెలిపారు. అందులో తన పేరు కూడా ఉండడంతో ఆనందంతో గంతేశానని అన్నాడు. ఇక తాను గెలుచుకున్న ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని స్వదేశంలో తన కలల ఇంటిని నిర్మించుకోవడానికి ఖర్చు చేస్తానన్నాడు. అలాగే మిగిలిన నగదును తన పిల్లల చదువుకు వినియోగిస్తానని తెలిపాడు.

Lucky Draw for Vaccinated: వ్యాక్సిన్ వేసుకుంటే లక్కీ డ్రాలో ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, టీవీలు ఇస్తోన్న గవర్నమెంట్

మరో విజేత కొచప్పన్ మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా నేను క్రమంతప్పకుండా మహజూజ్ రాఫెల్‌లో పాల్గొంటున్నట్లు తెలిపాడు. అయితే ఎప్పుడూ నిరాశే ఎదురయ్యేదని, కానీ ఈసారి అదృష్టం తలుపుతట్టిందని ఆనందం వ్యక్తం చేశాడు. కరోనా కారణంగా రెండున్నరేళ్లుగా తన కుటుంబాన్ని కలవలేకపోయాని, తాను గెలిచిన ఈ భారీ నగదు చేతికి రాగానే వెంటనే స్వదేశానికి వచ్చి ఫ్యామిలీతో కలుస్తానని చెప్పాడు.