Lucky Draw Cheating : లక్కీ డ్రా పేరుతో కుచ్చుటోపీ…రూ.3 కోట్లు మోసానికి పాల్పడ్డ నిర్వాహకులు

అమాయక ప్రజల అమాయకత్వంను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకుల ఉదంతo అచ్చంపేటలో వెలుగు చూసింది.

Lucky Draw Cheating : లక్కీ డ్రా పేరుతో కుచ్చుటోపీ…రూ.3 కోట్లు మోసానికి పాల్పడ్డ నిర్వాహకులు

Lucky Draw cheating

Lucky Draw Cheating :  అమాయక ప్రజల అమాయకత్వంను  ఆసరాగా చేసుకొని  మోసాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకుల  ఉదంతం అచ్చంపేటలో వెలుగు చూసింది.  నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఒక ప్రముఖ రాజకీయపార్టీకి చెందిన కొందరు నాయకులు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ లక్ష్మీ నర్శింహా స్వామి ఎంటర్ ప్రైజెస్ లక్కీ డ్రా పేరుతో  ఒక స్కీం ప్రారంభించారు.  అచ్చంపేట నల్లమల ప్రాంతంలో  ఉన్న ప్రజల వద్దనుంచి డబ్బులు కట్టించుకుని భారీ మోసానికి తెర తీశారు.

ఒక్కోక్కరి వద్ద నుంచి మూడు వందల చొప్పున  సుమారు లక్ష మంది వద్ద నుంచి మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. నూతన సంవత్సర సందర్భంగా నిన్న శనివారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో డ్రా తీసేందుకు ఏర్పాట్లు చేశారు నిర్వహకులు. డ్రాలో సభ్యులకు సంబంధించిన టిక్కెట్ల నంబర్లు వేయకుండా వారికి తెలిసిన వారి టిక్కెట్లు నంబర్లు వేసి డ్రా తీయడం జరిగింది.
Also Read : Girls Raped : పోలీసునంటూ బెదిరించి ఇద్దరు గిరిజన బాలికలపై అత్యాచారం
లక్కీ డ్రాలో సభ్యులకు సంబంధించిన నంబర్లు వేయక పోవడంతో సభ్యులు.. నిర్వహకుల మధ్యన ఘర్షణ జరిగింది. దీoతో నిర్వహకులు అక్కడి నుంచి జారుకున్నారు. నిర్వాహాకులు పారిపోవటంతో బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పరారీలో ఉన్న నిర్వాహకులపై బాధితులు అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిర్వాహకుల పై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ విలేకరులకు తెలిపారు.