Pakistan: పాక్ ప్ర‌జ‌ల‌కు షాక్.. వంట నూనె ధ‌ర లీట‌రుకు రూ.208 పెంపు

వంట నూనె ధ‌ర లీట‌రుకు రూ.208, నెయ్యి ధ‌ర రూ.213 పెంచుతున్న‌ట్లు పాక్ స‌ర్కారు ప్ర‌క‌టించింది. దీంతో ఆ దేశంలో వంట నూనె కిలో రూ.555, నెయ్యి లీట‌రు రూ.605కి చేరింది.

Pakistan: పాక్ ప్ర‌జ‌ల‌కు షాక్.. వంట నూనె ధ‌ర లీట‌రుకు రూ.208 పెంపు

Oil

Pakistan: క్ర‌మంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోన్న పాకిస్థాన్‌లో నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి. దీంతో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు పాక్ చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ‌ట్లేదు. ధరలు పెంచడం మినహా పాక్ ప్రభుత్వం ముందు ఏ మార్గం లేకుండాపోయింది. తాజాగా, వంట నూనె, నెయ్యి ధ‌ర‌ల‌ను అతి భారీగా పెంచుతూ పాక్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుంచి ఈ ధ‌ర‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి.

Yogi Adityanath: అయోధ్య‌ రామాల‌యం ‘జాతీయ మందిరం’ అవుతుంది: యోగి

వంట నూనె ధ‌ర లీట‌రుకు రూ.208, నెయ్యి ధ‌ర రూ.213 పెంచుతున్న‌ట్లు పాక్ స‌ర్కారు ప్ర‌క‌టించింది. దీంతో ఆ దేశంలో వంట నూనె కిలో రూ.555, నెయ్యి లీట‌రు రూ.605కి చేరింది. ఒకేసారి వంట నూనె, నెయ్యి ధ‌ర‌ల‌ను పాక్ స‌ర్కారు భారీగా పెంచ‌డంతో ప్ర‌జ‌లు షాక్ అయ్యారు. పాకిస్థాన్‌లో ఈ స్థాయిలో వాటి ధ‌ర‌లు ఎన్న‌డూలేవు. ధ‌ర‌ల‌ను ఈ స్థాయిలో ఎందుకు పెంచామ‌న్న విష‌యంపై పాక్ స‌ర్కారు వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. వంట నూనె, నెయ్యి త‌యారీదారులకు దాదాపు పాక్‌లోని యుటిలిటీ స్టోర్స్ కార్పొరేష‌న్ (యూఎస్సీ) దాదాపు రూ.300 కోట్లు ఇవ్వాల్సి ఉండ‌గా, ఆ చెల్లింపులు చేయ‌లేద‌ని ఓ అధికారి చెప్పారు. దీంతో యూఎస్సీకి త‌యారీదారులు వంట నూనె, నెయ్యిని సర‌ఫ‌రా చేయ‌డం ఆపేశార‌ని వివ‌రించారు.