Yogi Adityanath: అయోధ్య‌ రామాల‌యం ‘జాతీయ మందిరం’ అవుతుంది: యోగి

 ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో నిర్మిస్తోన్న రామాల‌యం జాతీయ మందిరం అవుతుంద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ చెప్పారు.

Yogi Adityanath: అయోధ్య‌ రామాల‌యం ‘జాతీయ మందిరం’ అవుతుంది: యోగి

Yogi

Yogi Adityanath: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో నిర్మిస్తోన్న రామాల‌యం ‘జాతీయ మందిరం’ అవుతుంద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ చెప్పారు. రామాల‌యం ప‌నులు కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో యోగి ఆదిత్య‌నాథ్ బుధ‌వారం మందిర ‘గ‌ర్భ గృహ’ నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా యోగి మాట్లాడారు. ఈ రోజు కోస‌మే దేశ ప్ర‌జ‌లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నార‌ని అన్నారు.

congress: కాంగ్రెస్ కంటే బీజేపీకి 6.4 రెట్లు అధికంగా విరాళాలు

భార‌తదేశ ఐక్య‌త‌కు ఈ రామ మందిరం ఓ చిహ్నంగా నిలుస్తుంద‌ని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దాదాపు రెండేళ్ల క్రితం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని గుర్తు చేశారు. ఆ ప‌నులు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. అనంత‌రం యోగి ఆదిత్య‌నాథ్ శ్రీ రామ్‌లాలా స‌ద‌న్‌ను ప్రారంభించారు. ఆయ‌న‌తో పాటు డిప్యూటీ సీఎం కేశవ్ ప్ర‌సాద్ మౌర్య‌, 90 మ‌ఠాలు, ఆల‌యాల‌కు చెందిన‌ సాధువులు, మ‌హంతులు ఉన్నారు.