Mango Guinness Record: గిన్నీస్ రికార్డుకెక్కిన మామిడికాయ..బరువు 4.25 కేజీలు…!

Mango Guinness Record: గిన్నీస్ రికార్డుకెక్కిన మామిడికాయ..బరువు 4.25 కేజీలు…!

Mango Guinness Record

Biggest Mango Guinness Record : వేసవికాలం మామిడికాయల సీజన్. రకరకాల మామిడి పండ్లు మార్కెట్లో నోరూరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ భారీ మామిడికాయ గిన్నీస్ రికార్డు సొంతం చేసుకుంది. ఎందుకంటే ఈ మామిడికాయ ఏకంగా ఫుట్‌బాల్ అంత సైజు అంత ఉంది. బరువు ఏకంగా 4.25 కేజీలుంది. దీంతో ఈ భారీ మామిడి గిన్నీస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుని బుక్ లోకి ఎక్కేసింది. అంత పెద్ద మామిడికాయ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు కాబట్టి దీనికి గిన్నీస్ రికార్డు సొంతమైంది. మరి ఇది ఎక్కడ కాసిందంటే..

కొలంబియాలోని గ్వాయటాలో… జర్మన్ ఓర్లాండో నావోయా, రైనా మారియా మర్రోకన్ దంపతులున్నారు. దంపతులు ఇద్దరూ రైతులే. వారికి తోట ఉంది. ఆతోటలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి.వాటిలో మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్లలో ఓ చెట్టు పెద్ద పెద్ద మామిడి కాయలు కాసింది. వాటిలో ఓ కాయ మాత్రం రోజు రోజుకు పెద్దగా పెరుగుతుంటే చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. రోజురోజుకూ ఆకాయ సైజు పెరుగుతుంటే… ఎంత పెరుగుతుందో చూద్దామని రోజు దాన్ని గమనిస్తుండేవారు.

అలా ఓ రోజు దాన్ని కింద వెయిట్ మిషన్ పెట్టి బరువు ఎంతుందో చూశారు. అది 4.25 కిలోల బరువుంది. ఆ పెద్ద కాయకు చూసిన రైతు దంపతుల కూతురు ఇంటర్ నెట్ లో అతి పెద్ద మామిడి కాయ ఎంత బరువుందో?ఎంత సైజు ఉందో చూసింది. కానీ ఇంత వరకూ తమ తోటలో కాసినంత భారీ కాయ లేదని తెలుసుకుంది. ప్రపంచంలోనే పెద్ద మామిడి తమదే అని గ్రహించింది. వెంటనే గిన్నీస్ బుక్ వారికి విషయం చెప్పింది. వెంటనే వారూ స్పందించారు.

వెంటనే కొలంబియాలోని జర్మన్ ఓర్లాండో నావోయా, రైనా మారియా మర్రోకన్ దంపతులను కలిశారు. ఏప్రిల్ 29న మామిడి కాయను బరువు చూశారు. అది 4.25 కేజీలు ఉంది. వావ్…ఇప్పటి వరకూ ఇటువంటి భారీ మామిడికాయ లేదు అంటూ..దాన్ని గిన్నీస్ బుక్‌ రికార్డు క్రియేట్ చేసిందంటూ దాన్ని బుక్ లోకి ఎక్కించారు. అలా ఆ భారీ మామిడికాయ గిన్నీస్ రికార్డు సొంతం చేసుకుంది.

కాగా..ఇంతకు ముందు 2009లో ఫిలిప్పీన్స్‌లో ఓ భారీ మామిడిపండు 3.435 కేజీలు బరువుతో కాసింది. ఇప్పటివరకూ దానిపేరు మీదనే గిన్నీస్ రికార్డ్ ఉంది. ఇప్పుడు ఈ 4.25 కేజీల మామిడి పండు దాన్ని రికార్డును బ్రేక్ చేసింది. రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ గిన్నీస్ మామిడిని కాయించిన కొలంబియా దంపతులు మాట్లాడుతూ..”కొలంబియా ప్రజలు వ్యవసాయాన్ని చాలా ప్రేమతో చేస్తారని కొత్త కొత్త పంటలు పండించటంలో కొలంబియా వ్యవసాయదారులు ముందుంటారని తెలిపారు. అలాగే ఈ దంపతులు తోటలో మామిడితోపాటూ… కాఫీ, అరెపాస్, మొగొల్లాస్ వంటివి పండిస్తారు. ఐతే…వీరు ధనవంతు కూడా కాదు. తమకున్న కొంచెం భూమిలో తమ కుటుంబ అవసరాల కోసమే వ్యవసాయం చేయటం గమనించాల్సిన విషయం.