వావ్.. జాబిల్లి ముందు స్పేస్ స్టేషన్ ఫొటో క్లిక్ మనిపించాడు

వావ్.. జాబిల్లి ముందు స్పేస్ స్టేషన్ ఫొటో క్లిక్ మనిపించాడు

Guy Clicks Space Station Pic: ఆండ్రూ మెక్ మెకార్తీ.. పరిచయం అక్కర్లేని పేరు. తన టెలిస్కోప్ ద్వారా స్పేస్ లో క్రేజీ ఫొటోస్ తియ్యడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు అనేక పిక్స్ తీశాడు. తన టాలెంట్ తో ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. స్పేస్ స్టేషన్ లో రేర్ పొజిషిన్స్ లో పిక్స్ తియ్యడంలో ఆండ్రూ దిట్ట. తాజాగా అతడు మరో ఎత్తుకి ఎదిగాడు. రేర్ పొజిషన్ లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఫొటో తీశాడు.

ISS space walk

జాబిల్లి ముందు ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ ఇమేజ్ లను క్యాప్చర్ చేయగలిగాడు. మూన్ బ్యాక్ గ్రౌండ్ లో స్పేస్ స్టేషన్ ఫొటో తీస్తే చాలు అని అనుకున్నాడు. కానీ, ఊహించని రీతిలో అద్భుతం జరిగింది. అనుకున్న దానికన్నా అద్భుతంగా, రేర్ పొజిషన్ లో పిక్ వచ్చింది. తాను తీసిన ఇమేజ్ లను ట్విట్టర్ లో షేర్ చేశాడు ఆండ్రూ. ఈ ఇమేజ్ లు చాలా అద్భుతంగా ఉన్నాయనే ప్రశంసలు అందుతున్నాయి.

ISS space walk