Lucky Man: అదృష్టవంతుడు..! దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ 33కోట్లు సంపాదించాడు.. ఎలా అంటే?

అజయ్ ఒగులాకు అదృష్టం తలుపుతట్టింది.  ఒకటి రెండు కోట్లు కాదు.. ఏకంగా 33 కోట్లు (15 మిలియన్ దిర్హామ్) రెండు లాటరీల ద్వారా గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. భారీ మొత్తంలో డబ్బురావటంతో అజయ్, అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవదులు లేవు.

Lucky Man: అదృష్టవంతుడు..! దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ 33కోట్లు సంపాదించాడు.. ఎలా అంటే?

Driver Ajay Ogula

Lucky Man: కోట్ల ఆస్తులను కూడబెట్టుకోవాలని ప్రతీఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా డబ్బే సర్వస్వంగా మారిన నేటిరోజుల్లో ఈ కోరిక ప్రతీఒక్కరిలో ఉంటుంది. అయితే, కోటీశ్వరులుగా మారడానికి ఒక్కోరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. డ్రైవర్ వృతి చేసుకుంటూ జీవించే వ్యక్తి కోటీశ్వరుడు కావాలంటే జీవితంతం కష్టపడినా సాధ్యంకాకపోవచ్చు. కానీ, ఒక్కోసారి అదృష్టవశాత్తూ కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోతారు. అదికూడా సక్రమమార్గంలోనే. ఇలాంటి వ్యక్తుల్లో అజయ్ అనే కారు డ్రైవర్ చోటు దక్కించుకున్నాడు. తన ఓనర్ ఇచ్చిన సలహాతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. రూ. 33కోట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

 

Driver Ajay Ogula

Driver Ajay Ogula

Lucky Man: అదృష్ట‌వంతులు.. రూ. 100 లాట‌రీ టికెట్‌కొని ల‌క్షాధికారుల‌య్యారు!

హైదరాబాద్‌‌కు  చెందిన అజయ్ ఒగులా జీవనోపాధికోసం నాలుగు సంవత్సరాల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లాడు. అక్కడ ఓ నగల కంపెనీ యాజమాని వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన యాజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తూ నెలవారి ఖర్చులు పోను కొంత డబ్బును పొదుపు చేసుకుంటూ వస్తున్నాడు. ఓ రోజు తన యాజమాని సలహాతో అజయ్ ధైర్యంచేసి ఎమిరేట్స్ డ్రా మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి అక్కడి నుంచి రెండు లాటరీలు కొనుగోలు చేశాడు. అయితే, అజయ్‌కు మాత్రం లాటరీలో బహుమతి సాధిస్తాననే నమ్మకం లేదు. కేవలం ఓ ఆశతో లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.

Lucky Woman : అదృష్టమంటే ఈమెదే.. లాటరీని పర్సులో పెట్టుకుని తిరిగింది.. కోట్లు గెల్చుకుంది!

కానీ, అజయ్ ఒగులాకు అదృష్టం తలుపుతట్టింది.  ఒకటి రెండు కోట్లు కాదు.. ఏకంగా 33 కోట్లు (15 మిలియన్ దిర్హామ్) రెండు లాటరీల ద్వారా గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. భారీ మొత్తంలో డబ్బురావటంతో అజయ్, అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవదులు లేవు. వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని దుబాయ్‌కి తీసుకెళ్లాలని, అక్కడే ఓ వ్యాపారం ప్రారంభించాలని అజయ్ భావిస్తున్నాడు. అంతేకాదు, తన సొంతగ్రామంలో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించాలని అనుకుంటున్నాడట.