Lucky Man: అదృష్ట‌వంతులు.. రూ. 100 లాట‌రీ టికెట్‌కొని ల‌క్షాధికారుల‌య్యారు!

అమృత్ స‌ర్‌లో రోడ్డుపైన చిన్న‌పాటి బండిపై వ్యాపారం చేసుకునే వ్య‌క్తి కుమార్తె రూ.100 లాట‌రీ టికెట్ కొనుగోలు చేసింది. ఆ లాట‌రీ టికెట్ తో వారి జీవితాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. వారు క‌ల‌లోసైతం ఊహించ‌ని విధంగా రూ.100 లాట‌రీ టికెట్ కు ఏకంగా రూ. 10ల‌క్ష‌లు గెలుచుకున్నారు.

Lucky Man: అదృష్ట‌వంతులు.. రూ. 100 లాట‌రీ టికెట్‌కొని ల‌క్షాధికారుల‌య్యారు!

Lucky

Lucky Man: మ‌న‌కు రాసిపెట్టిఉంటే అదృష్టం త‌లుపు త‌న్నుకొని వ‌స్తుంద‌ని మ‌న పెద్ద‌లు అంటుంటే వింటూనే ఉంటాం. ఇదేత‌ర‌హాలో ఓ చిరువ్యాపారికి అదృష్టం ప‌ట్టింది. చిన్న‌పాటి ప్ర‌య‌త్నంతో ఏకంగా ల‌క్షాధికారి అయ్యాడు. అమృత్ స‌ర్‌లో రోడ్డుపైన చిన్న‌పాటి బండిపై వ్యాపారం చేసుకునే వ్య‌క్తి కుమార్తె రూ.100 లాట‌రీ టికెట్ కొనుగోలు చేసింది. ఆ లాట‌రీ టికెట్ తో వారి జీవితాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. వారు క‌ల‌లోసైతం ఊహించ‌ని విధంగా రూ.100 లాట‌రీ టికెట్ కు ఏకంగా రూ. 10ల‌క్ష‌లు గెలుచుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవ‌దులు లేకుండా పోయాయి. తాము క‌ల‌లోకూడా ఊహించ‌ని విధంగా త‌మ‌కు డ‌బ్బు వ‌చ్చింద‌ని సంతోషంతో ఉబ్బిత‌బ్బిపోతున్నారు.

Lucky draw: అదృష్టం వరించింది.. లక్కీ డ్రాలో భారీమొత్తాన్ని గెలుచుకున్న ఇండియన్స్..

అమృత్‌స‌ర్‌కు చెందిన జ‌మాల్ సింగ్ తోపుడు బండిపై వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ‌త ఆదివారం సెల‌వు కావ‌డంతో అత‌డి కుమార్తె హ‌ర్‌సిమ్రాన్ కౌర్ కూడా తండ్రి వెంట వెళ్లింది. ఇదే స‌మ‌యంలో లాట‌రీ టికెట్లు అమ్మే ఓ వ్య‌క్తి వారి దుకాణానికి వ‌చ్చాడు. టికెట్ కేవ‌లం రూ. 100 అని ఒక‌టి కొనుగోలు చేయాల్సిందిగా కోరాడు. అయితే తొలుత జ‌మాల్ సింగ్ అందుకు నిరాక‌రించాడు. కుమార్తె మారం చేయ‌డంతో రూ.100 పెట్టి లాట‌రీ టికెట్ కొనుగోలు చేశాడు.

Nothing: ‘నథింగ్’ ఫోన్ దక్షిణాది కోసం కాదన్న సంస్థ.. మండిపడుతున్న నెటిజన్లు

నిర్వాహ‌కులు లాట‌రీ టికెట్ల‌కు బుధ‌వారం డ్రా నిర్వ‌హించారు. బాలిక రూ. 10ల‌క్ష‌లు గెలుచుకుంది. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే జ‌మాల్ సింగ్ కుటుంబ స‌భ్యుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఈ సంద‌ర్భంగా చిరు వ్యాపారి జ‌మాల్ సింగ్ మాట్లాడుతూ.. నేను తొలుత లాట‌రీ టికెట్ కొనేందుకు ఒప్పుకోలేద‌ని, కానీ త‌న కుమార్తె బ‌ల‌వంతంతో కొనుగోలు చేశాన‌ని, కానీ ఇప్పుడు రూ.10ల‌క్ష‌లు రావ‌టం ఎంతో సంతోషంగా ఉంద‌ని అన్నారు. ఈ డ‌బ్బుతో త‌మ క‌ష్టాలు తీరి, త‌న కుమార్తెను మంచిగా చ‌దివించుకొనేందుకు ఉప‌యోగిస్తాన‌ని తెలిపాడు.