Hero Rat: కంబోడియాలో మందుపాతరలను కనిపెట్టిన “హీరో ఎలుక” మృతి

ఎలుక సాహస సేవలను మెచ్చిన కంబోడియా ప్రభుత్వం దానికి సైన్యంలో ఇచ్చే గోల్డ్ మెడల్ కూడా బహుకరించింది. వందల సంఖ్యలో ల్యాండ్ మైన్లను కనిపెట్టి అక్కడి సైనికుల ప్రాణాలు కాపాడిన "మగావా".

Hero Rat: కంబోడియాలో మందుపాతరలను కనిపెట్టిన “హీరో ఎలుక” మృతి

Rat

Hero Rat: కంబోడియా దేశంలో ముప్పై ఏళ్ల పాటు జరిగిన యుద్ధ సమయంలో భూమిలో పాతిపెట్టిన కొన్ని లక్షల మందుపాతరలను నేటికీ వెలికి తీస్తున్నారు అక్కడి సైనికాధికారులు. భూమిలో ఉన్న మందుపాతరలను కనిపెట్టేందుకు ఎన్నో వ్యయప్రయాసలు కూర్చిన అక్కడి అధికారులు.. కొన్నేళ్ల క్రితం ఒక ఎలుక సహాయాన్ని తీసుకున్నారు. వందల సంఖ్యలో ల్యాండ్ మైన్లను వెలికి తీసి మనుషుల ప్రాణాలు కాపాడింది ఆ ఎలుక. దేశంలో ఎక్కడ ల్యాండ్ మైన్లు ఉన్నా ఆ ఎలుక సహాయం తీసుకున్న అధికారులు అది చూపిన తెగువకు సలాం కొట్టారు. “మగావా”గా నామకరణం చేసిన ఆధీర ఎలుక సాహస సేవలను మెచ్చిన కంబోడియా ప్రభుత్వం దానికి సైన్యంలో ఇచ్చే గోల్డ్ మెడల్ కూడా బహుకరించింది. వందల సంఖ్యలో ల్యాండ్ మైన్లను కనిపెట్టి అక్కడి సైనికుల ప్రాణాలు కాపాడిన “మగావా” ఇటీవల ప్రాణాలు విడిచింది. దాదాపు ఏడేళ్లుగా కంబోడియా సైన్యంలో మందుపాతరలు కనిపెట్టేందుకు సహాయం చేసిన “మగావా” ఎనిమిదేళ్ల వయసులో మృతి చెందిందంటూ కంబోడియా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

Also Read: Anand Mahindra: వయసుకే కాదు హృదయంలోనూ యవ్వనాన్ని చూడాలి

మగావా అందించిన సేవలు:
ఆఫ్రికాలోని టాంజానియాకు చెందిన “మగావా”..కంబోడియా సైన్యంలో.. తన సేవా కాలంలో దాదాపు 2,25,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ల్యాండ్ మైన్లను వెలికి తీసేందుకు సహాయపడింది. ఈ మొత్తం దూరం 42 ఫుట్ బాల్ మైదానాలకు సరిసమానం. ఒక టెన్నిస్ కోర్ట్ అంత స్థలంలో ల్యాండ్ మైన్లను వెతికేందుకు మగావాకు అరగంట సమయం పడుతుండగా.. అదే పని మెటల్ డిటెక్టర్ ద్వారా మనుషులు చేస్తే నాలుగు రోజుల సమయం పడుతుంది. ల్యాండ్ మైన్ ను గుర్తించిన వెంటనే అక్కడి భూమిని కొంతమేర తవ్వి వదిలేస్తుంది మగావా. అనంతరం అధికారులు జాగ్రత్తగా అక్కడి ల్యాండ్ మైన్ ను తొలగించి నిర్వీర్యం చేసేవారు. అలా తన సేవాకాలంలో మొత్తం 100కు పైగా ల్యాండ్ మైన్లను ఇతర పేలుడు పదార్ధాలను మగావా కనిపెట్టింది.

Also read: Uttar Pradesh Politics: మంత్రి పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే అరెస్ట్ వారెంట్

మగావా సాధించిన ఘనతలు :
ఇక 2021 జూన్ లో మగావాకు కంబోడియా సైనికాధికారులు విశ్రాంతి కల్పించారు. ఇక సైన్యంలో “మగావా” అందించిన సేవలకు మెచ్చి.. 2020 సెప్టెంబర్ లో బ్రిటన్ ప్రభుత్వం.. తమ పౌరులకు సమానంగా.. జంతువులకు ఇచ్చే దేశ అత్యున్నత గౌరవ పురష్కారాన్ని మగావాకు అందించింది. మనుషుల రక్షణలో.. తెగువ, ధైర్యసాహసాలను ప్రదర్శించే పక్షులు, జంతువులకు బహుమతులు ప్రధానం చేసే.. పశువుల దాతృత్వ సంస్థ PDSA.. తన 77 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసరిగా “మగావా”కు మెడల్ అందించింది.

ఎలుకకు శిక్షణ ఎలా ఇచ్చారు:
ల్యాండ్ మైన్లను కనిపెట్టడంలో మగావాకు శిక్షణ ఇచ్చిన APOPO అనే చారిటీ సంస్థకే దాన్ని అప్పగించారు. APOPO అనేది బెల్జియంకు చెందిన ఒక NGO. ల్యాండ్ మైన్లు కనిపెట్టేందుకు ఎలుకలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు ఇక్కడ. అమెరికా సైన్యం సహకారంతో ఈ APOPO NGOని నిర్వహిస్తున్నారు. మందుపాతరలు, ఇతర పేలుడు పదార్ధాల్లో ఉండే రసాయనాల వాసనను పసిగట్టే విధంగా ఇక్కడ ఎలుకలకు శిక్షణ ఇస్తారు. మగావా ఎలుకకు అదే రకమైన శిక్షణ ఇచ్చారు. శిక్షణ సమయంలో దానికి ఎంతో ఇష్టమైన అరటిపళ్ళు, వేరుశెనగ గింజలను ఆహారంగా అందించారు. దీంతో అది ఎంతో చలాకీగా పేలుడు పదార్ధాలను కనిపెట్టగలిగిందని మగావా ఎలుకకు శిక్షణ ఇచ్చిన వ్యక్తి పేర్కొన్నారు.

Also read: Snow in Kashmir: భూతల స్వర్గం మన కాశ్మీరం

మగావా మృతితో విషాదం:
కాగా 2021 జూన్ లో కంబోడియా నుంచి మగావాను తిరిగి తీసుకున్న APOPO..ఆనాటి నుంచి దాని సంరక్షణ చేపట్టింది. అయితే మగావా చనిపోయే ఒక వారం ముందు వరకు ఎంతో యాక్టివ్ గా ఉందని, వయసు(8ఏళ్లు) మీరడంతో ప్రశాంతంగా కన్నుమూసిందంటూ APOPO ప్రకటించింది. “మగావా” మృతి తమకు విషాదం మిగిల్చిందని శిక్షణ సంస్థ APOPO, కంబోడియా సైనికాధికారులు ప్రకటించారు

Also read: Strong Girl Child: గొడ్డలి అక్కర్లేదు, పిడిగుద్దులతో చెట్టును కూల్చిన 12 ఏళ్ల బాలిక