Anand Mahindra: వయసుకే కాదు హృదయంలోనూ యవ్వనాన్ని చూడాలి

యవ్వనం అనేది వయసులోనే కాదని, హృదయంలోనూ యవ్వనాన్ని చూడాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం సంధర్భంగా ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికర ట్వీట్

Anand Mahindra: వయసుకే కాదు హృదయంలోనూ యవ్వనాన్ని చూడాలి

Anand

Anand Mahindra: యవ్వనం అనేది వయసులోనే కాదని, హృదయంలోనూ యవ్వనాన్ని చూడాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం సంధర్భంగా ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. పాఠశాల తరగతి గదిలో ఆనంద్ మహీంద్రా చిన్నారులతో కలిసి చివరి బెంచిలో కూర్చున్న ఫోటోను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. “యువజన దినోత్సవాన్ని కేవలం వయస్సులో ఉన్న యువకులను మాత్రమే కాకుండా హృదయపూర్వకంగా కూడా జరుపుకుంటామని నేను నమ్ముతున్నాను. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో తాజా, యవ్వన దృక్పథాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనదని నేను నమ్ముతున్నాను.” అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Also read: Uttar Pradesh Politics: మంత్రి పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే అరెస్ట్ వారెంట్

కాగా క్లాస్ రూమ్ లో చివరి బెంచిలో కూర్చున్న ఆనంద్ మహీంద్రాను చూసిన నెటిజన్లు ఆయనపై పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. “సార్ మీరు బ్యాక్ బెంచీ బ్యాచ్ లో ఎందుకు కూర్చున్నారు అంటూ ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు మహీంద్రా స్పందిస్తూ.. వెనుక బెంచిలో కూర్చున్నవారికే తరగతి మొత్తం కనిపిస్తుందని, వారు విశ్వాన్ని కూడా చూడగలరని అన్నారు. చదువుకునే రోజుల్లో మీకు ఇష్టమైన సబ్జెక్టు ఏంటి అంటూ మరొకరు అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. “చరిత్ర” అని సమాధానం ఇచ్చారు.

Also read: Snow in Kashmir: భూతల స్వర్గం మన కాశ్మీరం

గతాన్ని క్షుణ్ణంగా విశ్లేషించుకుంటేనే భవిష్యత్తులో మంచి ఆవిష్కరణలు సాధ్యమౌతాయని మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఇదే ప్రశ్నకు మరొక సమాధానం ఇస్తూ.. నేర్చుకోవాలనే తపన ఉంటే ఏది బోర్ కొట్టదని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తికరంగా పాఠాలను బోధించాలని ఈ విషయంలో వారిపై కొంత ఒత్తిడి ఉన్నా తట్టుకోవాలని సూచించారు. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

Also read: Strong Girl Child: గొడ్డలి అక్కర్లేదు, పిడిగుద్దులతో చెట్టును కూల్చిన 12 ఏళ్ల బాలిక