Uttar Pradesh Politics: మంత్రి పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే అరెస్ట్ వారెంట్

బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన 24 గంటల్లోనే స్వామిప్రసాద్ మౌర్యపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అది కూడా ఏడేళ్ల నాటి ఒక కేసుకు సంబంధించింది

Uttar Pradesh Politics: మంత్రి పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే అరెస్ట్ వారెంట్

Swamiprasad

Uttar Pradesh Politics: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది. పార్టీ మారుతున్న వారిని అడ్డుకునేందుకు బీజేపీ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుంది. మంగళవారం మంత్రి పదవికి రాజీనామా చేసి, సమాజ్ వాదీ పార్టీలో చేరిన మాజీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్యపై అరెస్ట్ వారంట్ జారీ అయింది. బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన 24 గంటల్లోనే స్వామిప్రసాద్ మౌర్యపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అది కూడా ఏడేళ్ల నాటి ఒక కేసుకు సంబంధించింది.

Also read: Snow in Kashmir: భూతల స్వర్గం మన కాశ్మీరం

2014లో బహుజన్ సమాజ్వాదీ పార్టీలో ఉన్న స్వామిప్రసాద్.. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై సుల్తాన్ పూర్ లో కేసు నమోదు అయింది. అయితే 2016 అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. ఆకేసుపై కోర్ట్ తాత్కాలికంగా స్టే విధించింది. ఎమ్మెల్యేగా గెలిచిన స్వామిప్రసాద్ బీజేపీలో చేరగా సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఆయనకు మంత్రి పదవి అప్పగించారు. అయితే బీజేపీ హయాంలో బడుగుబలహీన వర్గాలు ఎదగలేకపోతున్నాయంటూ ఆరోపించిన స్వామిప్రసాద్ ఆమేరకు బీజేపీను వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. మంత్రి పదవి నుంచి తప్పుకున్న 24 గంటల్లోనే స్వామిప్రసాద్ పై అరెస్ట్ వారెంట్ జారీచేశారు. జనవరి 24లోగా కోర్టులో హాజరు కావాలంటూ సుల్తాన్ పూర్ లోని ఎంపీ, ఎమ్మెల్యేల కోర్ట్ ఆదేశించింది.

Also read: Punjab AAP : డోర్ టు డోర్ క్యాంపెయిన్…ఆప్‌‌కు నోటీసులిచ్చిన రిటర్నింగ్ ఆఫీసర్