Punjab AAP : డోర్ టు డోర్ క్యాంపెయిన్…ఆప్‌‌కు నోటీసులిచ్చిన రిటర్నింగ్ ఆఫీసర్

మోడల్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆ పార్టీకి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు...

Punjab AAP : డోర్ టు డోర్ క్యాంపెయిన్…ఆప్‌‌కు నోటీసులిచ్చిన రిటర్నింగ్ ఆఫీసర్

Aap

Kharar Returning Officer : పంజాబ్ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న ఆప్ పార్టీ ప్రచారం ముమ్మరం చేపట్టింది. 2022, డిసెంబర్ 12వ తేదీ బుధవారం ఆ పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభించింది. స్వయంగా ఆ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. ఆప్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే…రిటర్నింగ్ ఆఫీసర్ సీరియస్ అయ్యారు. మోడల్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆ పార్టీకి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Read More : CM KCR : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ఎన్నికల సంఘం పలు నిబంధనలు విధించింది. అన్ని రకాల బహిరంగసభలపై నిషేధం విధిస్తున్నట్లు, రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని డిజిటల్ పద్ధతిలో నిర్వహించుకోవాలని సూచించింది. తర్వాత పరిస్థితిని సమీక్షించి కొత్త ఆదేశాలు జారీ చేస్తామని, అప్పటి వరకు పాదయాత్ర, సైకిల్ యాత్ర, రోడ్ షోలు ఉండవని చెప్పారు. దీంతో పలు పార్టీలు డిజిటల్ ప్రచారం వైపు మొగ్గు చూపుతున్నాయి. కానీ..ఆప్ పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

Read More : Strong Girl Child: గొడ్డలి అక్కర్లేదు, పిడిగుద్దులతో చెట్టును కూల్చిన 12 ఏళ్ల బాలిక

ఇదిలా ఉంటే…ఆప్ పార్టీ ఎన్నికల హామీలు విడుదల చేసింది. ప్రజలను ఆకట్టుకొనే విధంగా కేజ్రీవాల్ హామీలు రూపొందించారు. 10 పాయింట్ల పంజాబ్ మోడల్ సిద్దం చేసింది. తాము అధికారంలోకి వస్తే పది పాయింట్లను కచ్చితంగా అమలుచేస్తామని హామీ ఇచ్చింది. ప్రశాంతమైన పంజాబ్ ను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీల్లో పేర్కొన్నారు. త్యాగాల కేసులలో అమరులైన వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని ఆ పార్టీ వెల్లడించింది. అవినీతిని అంతమొందిస్తామని తెలిపిన కేజ్రీవాల్…రాష్ట్రంలోని మాదకద్రవ్యాల సిండికేట్‌ను తుడిచివేస్తామన్నారు.

Read More : Mobiles Turnoff : విమానంలో ఫోన్లను స్విచ్ఛాఫ్, ఫ్లైట్ మోడ్‌లో ఎందుకు పెడతారో తెలుసా?

ఉపాధి కోసం కెనడా వెళ్లిన పంజాబీలు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. పంజాబ్ లో 18ఏళ్ల వయస్సు దాటిన యువతులకు నెలకు వెయ్యి రూపాయలిస్తామని తెలిపారు. ప్రో బిజినెస్ గవర్నెన్స్ రూపొందిస్తామని, 16వేల మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసి, ప్రతి పంజాబీకి ఉచిత చికిత్స అందిస్తామని కీలక ప్రకటన చేసింది. 24/7 ఉచిత విద్యుత్ కూడా అందించేందుకు ప్రయత్నిస్తామని, రైతుల సమస్యలు తీరుస్తామని తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలో 117 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ ఫిబ్రవరి 14వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరుగనుంది.