Covid Symptoms in Children: పిల్లల్లో పెద్దల మాదిరిగా కరోనావైరస్ లక్షణాలు ఉండట్లేదట!

Covid Symptoms in Children: పిల్లల్లో పెద్దల మాదిరిగా కరోనావైరస్ లక్షణాలు ఉండట్లేదట!

Children

HIDDEN SIGNS: కోవిడ్ -19 ప్రధాన లక్షణాలు కొత్త నిరంతర దగ్గు, జ్వరం, రుచి మరియు వాసన కోల్పోవడం.. కానీ పిల్లల్లో మాత్రం కోవిడ్ లక్షణాలు పెద్దోళ్లలో మాదిరిగా ఉండట్లేదు. పిల్లల్లో ముఖ్య లక్షణం కండరాల నొప్పులతో బాధపడడం అని నిపుణులు అంటున్నారు. సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం వైరస్ పాజిటివ్ పరీక్షించిన 12,306 మంది పిల్లల డేటా చూడగా వారిలో ఈ లక్షణాలే కనిపించాయి.

కోవిడ్ -19 కు సంక్రమించేటప్పుడు పిల్లలు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని, 11 ముఖ్య లక్షణాలతో బాధపడుతున్నారని పరిశోధనలు చెబుతున్నారు.

అధ్యయనంలో 18శాతం మంది పిల్లలకు జ్వరం, కండరాలు లేదా కీళ్ల నొప్పులు, వాసన లేదా రుచి వంటి లక్షణాలు ఉన్నాయని అలబామాలోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన రచయిత పకాజ్ అరోరా చెప్పారు. 16.5 శాతం మంది పిల్లలకు ఊపిరి పీల్చుకోవడంలో సమస్య.. దగ్గు ఉందని నిపుణులు వెల్లడించారు. 13.9 శాతం మందిలో వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించినట్లు చెబుతున్నారు. సుమారు 8.1 శాతం మంది దద్దుర్లుతో బాధపడుతుండగా, 4.8 శాతం మందికి తలనొప్పి వచ్చింది.

అధ్యయనంలో వచ్చిన డేటా ప్రకారం.. కేవలం 5.5 శాతం మంది పిల్లలు వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. హాస్పిటలైజేషన్ ప్రమాదం అమ్మాయి మరియు అబ్బాయిలలో ఒకటేనని వెల్లడించారు.

పిల్లలలో 11 కరోనావైరస్ లక్షణాలు:
జ్వరం
కండరాల లేదా కీళ్ల నొప్పి
నీరసం, కడుపునొప్పి
వాసన లేదా రుచి కోల్పోవడం..
శ్వాస ఆడకపోవడం..
దగ్గు
వికారం
వాంతులు
అతిసారం
దద్దుర్లు
తలనొప్పి

తొలి దశలో కేవలం 4శాతం చిన్నారులపై కరోనా ప్రభావం ఉండగా.. ఇప్పుడు 15 నుంచి 20శాతం మంది పిల్లలే బాధితులుగా ఉన్నారు. మూడో దశలో ఇది 80శాతం పైనే ఉండొచ్చని అంచనా. జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉండి ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించొచ్చు. ఆయాసం, వేగంగా శ్వాస తీసుకోవాల్సి రావడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వంటి లక్షణాలుంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తీవ్ర అస్వస్థతకు గురైన పిల్లలకు వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి ఉంటుంది.