Hong Kong Flights: ఇండియా నుంచి హాంకాంగ్‌కు విమానాలు రేపటితో రద్దు

హాంకాంగ్ విమానాయాన శాఖ ఆదివారం కీలక ప్రకటన వెల్లడించింది. అంతేకాకుండా తాము పాకిస్తాన్, ఫిలిప్పైన్స్ విమానాలను

Hong Kong Flights: ఇండియా నుంచి హాంకాంగ్‌కు విమానాలు రేపటితో రద్దు

Hongkong Flihghts

Hong Kong Flights: కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఇరు దేశాల మధ్య రాకపోకలకు బ్రేక్ వేయాలని నిర్ణయించాయి ఇండియా – హాంకాంగ్. ఈ మేరకు హాంకాంగ్ విమానాయాన శాఖ ఆదివారం కీలక ప్రకటన వెల్లడించింది. అంతేకాకుండా తాము పాకిస్తాన్, ఫిలిప్పైన్స్ నుంచి వచ్చే విమానాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది హాంకాంగ్.

ఏప్రిల్ నెలలోనే రెండు విస్తారా విమానాలు 50ప్రయాణికుల చొప్పున హాంకాంగ్ కు చేరుకున్నాయి. ఆ తర్వాతే అక్కడికి చేరుకున్న ప్రయాణికులకు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. నియమాలకు అనుగుణంగా ఆర్టీపీసీఆర్ ఫలితంలో 72గంటల ముందు నెగెటివ్ వస్తేనే ప్రయాణించాల్సి ఉంది.

ఈ మేరకు ఆదివారం ముంబై నుంచి హాంకాంగ్ వెళ్లే విమానాలన్నింటినీ మే2 వరకూ రద్దు చేస్తున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం చేరుకున్న ప్రయాణికుల్లోనూ ముగ్గురు పాజిటివ్ గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతకంటే ముందు ఢిల్లీ నుంచి హాంకాంగ్ కు వెళ్లే విమానాల్లోని ప్రయాణికులకు 47మంది వరకూ పాజిటివ్ వచ్చింది. దీంతో ఏప్రిల్ 6నుంచి ఏప్రిల్ 19వరకూ ఆ మార్గంలోని విమానాల రాకపోకలు నిలిపేశారు.

మరోవైపు ఇండియాలో రికార్డు స్థాయిలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి. ఒక్క రోజులోనే 2లక్షల 61వేల 500నమోదుకాగా మొత్తం కేసులు కోటి 47లక్షల 88వేల 109గా ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18లక్షల వరకూ ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. మొత్తం మృతుల సంఖ్య లక్షా 77వేల 150మంది ఉన్నారు.