Mexico earthquake: మెక్సికో పసిఫిక్ తీరంలో భారీ భూకంపం.. బొమ్మల్లా ఊగిన భవనాలు, కార్లు, ఈత కొలనులో మినీ సునామీ.. వీడియోలు వైరల్

మెక్సికోలోని పసిఫిక్ తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజిక్ సర్వే ప్రకారం.. స్థానిక కాలమానం మధ్యాహ్నం 1.05 గంటలకు 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Mexico earthquake: మెక్సికో పసిఫిక్ తీరంలో భారీ భూకంపం.. బొమ్మల్లా ఊగిన భవనాలు, కార్లు, ఈత కొలనులో మినీ సునామీ.. వీడియోలు వైరల్

Mexico earthquake

Mexico earthquake: మెక్సికోలోని పసిఫిక్ తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజిక్ సర్వే ప్రకారం.. స్థానిక కాలమానం మధ్యాహ్నం 1.05 గంటలకు 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం దాటికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.

మెక్సికో పసిఫిక్ తీరంలో భారీ భూకంపం రావడంతో సునామీ హెచ్చరికలు ఏమీ జారీకాలేదు. అయితే భారీఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

ఈ భూకంపం అక్విలాకు ఆగ్నేయంగా 37 కిలోమీటర్ల దూరంలో కొలిమా, మిచోకాన్ రాష్ట్రాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. అయితే భవనాలు ఒక్కసారిగా అటూఇటూ ఊగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. మెక్సికన్ పబ్లిక్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ప్రస్తుతానికి ప్రాణ, ఆస్తి నష్టం గురించి తక్షణ నివేదికలు ఏమీ లేవని తెలిపారు. అయితే కొన్ని భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. ఇదిలాఉంటే భారీ తీవ్రతతో భూకంపం రావడంతో భవనాలు, రోడ్లు, కార్లు బొమ్మల్లా ఊగాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మెక్సికో పసిఫిక్ తీరంలో భూకంపం సంభవించింది. ప్యూర్టో వల్లర్టాలోని మా హోటల్ గది తీవ్రంగా కదిలింది అని ఓ వినియోగదారుడు ట్విట్టర్ రాశారు. అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు. అదేవిధంగా.. భూకంపం దాటికి మా రూఫ్‌టాప్ స్విమ్మింగ్ పూల్‌లో మినీ సునామీ వచ్చిందంటూ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు.