Man Drowning Mud : బురదలో పడి మునిగిపోయిన భర్త..నవ్వుతూ వీడియో తీసిన భార్య

ఓ వ్యక్తి బురద మట్టిలో నడుస్తూ అమాంతం కొన్ని సెకన్లపాటు మాయమైపోయాడు. బురద అనుకొని పెద్ద గోతిలో కాలు వేయడంతో నిండా మునిగిపోయాడు. అతడికి సాయం చేయాల్సిన భార్య.. ఇదంతా వీడియో తీస్తూ పగలబడి నవ్వింది

Man Drowning Mud : బురదలో పడి మునిగిపోయిన భర్త..నవ్వుతూ వీడియో తీసిన భార్య

Man Drowning Mud

man drowning mud : ఓ వ్యక్తి బురద మట్టిలో నడుస్తూ అమాంతం కొన్ని సెకన్లపాటు మాయమైపోయాడు. బురద అనుకొని పెద్ద గోతిలో కాలు వేయడంతో నిండా మునిగిపోయాడు. అతడికి సాయం చేయాల్సిన భార్య.. ఇదంతా వీడియో తీస్తూ పగలబడి నవ్వింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు సైతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే బ్రిటిష్‌ టూరిస్ట్‌ మార్టిన్‌ లూయిస్‌ తన భార్య రచెల్‌తో కలిసి మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. అక్కడ వ్యూవాములా‌ ప్రాంతంలో రోడ్డు మీద కాకుండా షార్ట్‌కట్‌ మార్గంలో వెళ్దామని అతని భార్య సలహా ఇచ్చింది.

దారిలో వారు బురదను దాటాల్సి వచ్చింది. దీంతో అతడు చెప్పులు చేతులో పట్టుకుని ప్యాంటు తడవకుండా ఎంతో జాగ్రత్తగా బురదను దాటేందుకు కాలు ముందుకేశాడు. ఈ క్రమంలో ఒక అడుగు ముందుకు పడటంతో కాలుజారి బురదలో పడి మునిగిపోయాడు. బురదలో పడిన వెంటనే మార్టిన్ కొన్ని సెకన్ల వరకు బయటకు రాలేదు. అయితే అతడి భార్య సాయం చేయకుండా వీడియో తీస్తూనే ఉంది. అంతేగాక భర్త గుంటలో పడటంతో పగలబడి నవ్వుతూనే ఉంది. దీంతో అతడు కోపంతో ‘‘నాతో మాట్లాడకు’’ అని భార్యతో అరిచాడు. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పటి వరకు 28 మిలియన్ల వ్యూవ్స్‌ సంపాదించింది.

అనంతరం మార్టిన్ తన అనుభవాన్ని షేర్‌ చేస్తూ ‘మేము ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నాము. నా భార్య మరోవైపుకు వెళ్లేందుకు దగ్గరి దారి ఉందని ఇలా తీసుకెళ్లింది. బురదలోకి వెళితే నా పాదాలు తడిసిపోతాయని నాకు తెలుసు. నా ప్యాంటు అడుగు కూడా నాశనం అవుతుందని భావించాను. కానీ దుస్తులు పాడవ్వకుండా జాగ్రత్తగా వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఒక్క అడుగు వేయగానే బురదలో ఉన్న గోతిలోకి వెళ్లిపోయాను. బురదలోకి పూర్తిగా మునిగిపోవడంతో షాక్‌కు గురయ్యా. నేను కిందికి వెళ్తూనే ఉన్నాను. దాదాపు తొమ్మిది నుంచి 10 అడుగుల లోతులో ఉంది. కానీ నేను భయపడలేదు, వెంటనే నీటి నుంచి బయటకొచ్చాను. అయితే నా భార్య 10 నిమిషాలపాటు నవ్వుతూనే ఉంది. తర్వాత బీచ్ వైపుకు వెళ్లి దుస్తులకు అంటుకున్న బురద మొత్తం తొలగించుకున్నాను’ అని తెలిపారు.