Andrew Symonds: నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను బ్రదర్.. కన్నీరు తెప్పిస్తున్న సైమండ్స్ సోదరి లేఖ..

ఆసిస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మృతి క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం పట్ల మజీ, తాజా క్రీడాభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆండ్రూస్‌తో కలిసి గడిపిన సంతోష సమయాలను గుర్తుచేసుకుంటున్నారు..

Andrew Symonds: నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను బ్రదర్.. కన్నీరు తెప్పిస్తున్న సైమండ్స్ సోదరి లేఖ..

Andrew Symonds

Andrew Symonds: ఆసిస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మృతి క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం పట్ల మజీ, తాజా క్రీడాభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆండ్రూస్‌తో కలిసి గడిపిన సంతోష సమయాలను గుర్తుచేసుకుంటున్నారు. గత శనివారం రాత్రి టౌన్స్‌విల్లేకు పశ్చిమాన 50 కి.మీ దూరంలో ఉన్న హెర్వీరేంజ్‌లో అతని కారు రోడ్డు పక్కకు వెళ్లి ప్రమాదానికి గురై ఆండ్రూస్ మృతి చెందిన విషయం విధితమే. సైమాండ్స్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నాయి. సోదరి లూయిస్ కూడా ఉంది. ఆండ్రూస్ మృతిపట్ల లూయిస్ కన్నీటి పర్యాంతమైంది. కారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో లూయిస్ ఓ లేఖను, పువ్వులు, సంతకం చేసిన క్రికెట్ బాల్, ఫిషింగ్ లైన్‌తో పాటు ఓ లేఖను ఉంచింది.

ఆ లేఖలో లూయిస్ రాసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తున్నాయి. చాలా త్వరగా వెళ్లిపోయావు! ఆండ్రూ.. విశ్రాంతి తీసుకోండి అని లూయిస్ లేఖ రాసింది. మనకు ఇంకోరోజు, ఇంకో ఫోన్ కాల్ ఉంటే బాగుండేది.. నీ మరణాన్ని నా మనసు తట్టుకోలేకపోతుంది.. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను మై బ్రదర్ అంటూ లేఖలో లూయిస్ రాసుకొచ్చింది. సైమండ్స్ ప్రమాదానికి గురైన చోట అతని కారులోని వస్తువులన్నీ పక్కనే ఉన్న పొదల్లో పడి ఉన్నాయి. అయితే సైమండ్స్ మృతిచెందిన ప్రదేశంలో స్థానికులు నివాళులర్పిస్తున్నారు. ఇదిలాఉంటే సైమండ్స్ రోడ్డుపై జంతువును తప్పించబోయి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు భావిస్తున్నాయి. సైమండ్స్ కారు ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.