Rishi Sunak: అక్రమ వలసదారులపై బ్రిటన్ కొరడా.. దేశంలోకి రాకుండా కొత్త చట్టం తెస్తున్న రిషి సునాక్

కొత్త చట్టం ప్రకారం ఇకపై వలసదారుల్ని బ్రిటన్‌లోకి అనుమతించారు. అనేక దేశాల నుంచి బ్రిటన్ సహా జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలకు అక్రమంగా వలస వస్తుంటారు. నిజానికి ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే బ్రిటన్‌కు వచ్చే వారి సంఖ్య తక్కువే. అయినప్పటికీ అక్కడికి వేలాది మంది సముద్ర మార్గంలో చిన్న బోట్ల ద్వారా వలస వస్తున్నారు.

Rishi Sunak: అక్రమ వలసదారులపై బ్రిటన్ కొరడా.. దేశంలోకి రాకుండా కొత్త చట్టం తెస్తున్న రిషి సునాక్

Rishi Sunak: తమ దేశంలోకి అక్రమంగా వలసలు పెరిగిపోతుండటంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దృష్టి సారించారు. వలసల్ని అడ్డుకునేలా కొత్త చట్టం రూపొందించాడు. ఈ విషయాన్ని రిషి సునాక్ అధికారికంగా వెల్లడించాడు. కొత్త చట్టం ప్రకారం ఇకపై వలసదారుల్ని బ్రిటన్‌లోకి అనుమతించారు.

International Women’s Day: మహిళల గౌరవార్థం ప్రత్యేక డూడుల్ రూపొందించిన గూగుల్

అనేక దేశాల నుంచి బ్రిటన్ సహా జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలకు అక్రమంగా వలస వస్తుంటారు. నిజానికి ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే బ్రిటన్‌కు వచ్చే వారి సంఖ్య తక్కువే. అయినప్పటికీ అక్కడికి వేలాది మంది సముద్ర మార్గంలో చిన్న బోట్ల ద్వారా వలస వస్తున్నారు. వలసదారులు అట్లాంటిక్ సముద్రం గుండా ఇంగ్లిష్ ఛానెల్ నుంచి బ్రిటన్ చేరుకుంటారు. ఉత్తర ఫ్రాన్స్.. దక్షిణ ఇంగ్లండ్ మధ్యలోని ప్రాంతం ద్వారా వలస వస్తుంటారు. అయితే, ఇలా వలస వచ్చే వారికి ఇకపై ఎలాంటి ఆశ్రయం ఇవ్వబోమని రిషి సునాక్ చెప్పారు. వీరికి ఇంతకుముందు ఉన్న బ్రిటన్ మోడర్న్ వలసదారుల/బానిసల రక్షణ చట్టం కూడా వర్తించదని ఆయన పేర్కొన్నారు.

International Women’s Day: మహిళా దినోత్సవం సందర్భంగా బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఎక్కడంటే

గతంలో దేశంలోకి వలస వచ్చిన వాళ్లు చాలా మంది ఈ చట్టం ద్వారా లబ్ధి పొందేవారు. అయితే, కొత్త చట్టం ద్వారా ఇది వర్తించకుండా చూస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే వేలాదిమందిని తీరంలో నిలిపివేశారు. ఒకవేళ దేశంలోకి వలస వస్తే వారికి ఎలాంటి ఆశ్రయం ఇవ్వరు. మానవ హక్కులు కూడా వర్తించవు. దేశంలో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా అక్రమంగా ఉంటున్నట్లు గుర్తిస్తే, వారాల వ్యవధిలోనే వాళ్లను దేశం నుంచి పంపించి వేస్తారు. వాళ్ల స్వంత దేశానికి లేదా పొరుగునే ఉన్న రువాండా వంటి దేశాలకు పంపిస్తారు. అలాగే ఆస్ట్రేలియా, అమెరికాలాగే భవిష్యత్తులో వారికి బ్రిటన్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తారు.

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం అసాధ్యం.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా: ఎమ్మెల్సీ కవిత

అయితే, చిన్న పిల్లలు లేదా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రం స్వల్పంగా వెసలుబాట్లు కల్పించారు. వీరికి తాత్కాలిక రక్షణ ఉంటుంది. అయితే, ఈ చట్టాన్ని బ్రిటన్ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని విమర్శిస్తున్నాయి. ఇంగ్లిష్ సులభంగా నేర్చుకోవడంతోపాటు, ఇక్కడ ఉపాధి కూడా త్వరగా దొరుకుతుంది అనే కారణాలతో వలసదారులు బ్రిటన్‌కు చేరుకుంటున్నారు. 2022లో 45,000 మంది, 2021లో 28,000 మంది, 2020లో 8,500 మంది వలసదారులు బ్రిటన్ చేరుకున్నారు.