పాక్ ప్రధాని ఇమ్రాన్ విమానంలో సాంకేతిక లోపం

పాక్ ప్రధాని ఇమ్రాన్ విమానంలో సాంకేతిక లోపం

సమావేశం ముగించుకుని తిరుగుప్రయాణమైన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొద్ది గంటల్లోనే తిరిగి న్యూయార్క్‌కు చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ జరిగింది. క్షణాల్లో ప్రత్యేక విమానం పంపించి ఇమ్రాన్ ఖాన్‌ న్యూయార్క్ వెళ్లే ఏర్పాటు చేశారు. 

ఐక్యరాజ్య సమితిలోని పాకిస్తాన్ అంబాసిడర్ మలీహా లోధి పాక్ ప్రధాని తిరిగి వచ్చేస్తున్నారని ఏడురోజుల పర్యటనలో భాగంగా విడిది చేస్తున్న హోటల్‌కు తిరిగి రానున్నట్లు ఆమె తెలిపారు. ఐక్యరాజ్య సమితి 74వ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో విమానంలో బయల్దేరారు. అయినప్పటికీ సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్ పోర్టులోనే కొద్ది గంటలపాటు ఉండిపోవాల్సి వచ్చింది. 

193మంది సభ్యులు ఉన్న మీటింగ్‌లో పాల్గొనేందుకు ఖాన్ బయల్దేరారు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో ఇంటర్నేషనల్ మీడియా సైతం దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశం లేవనెత్తి పలు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.