Nasa Photo : నాసా స్పేస్ కెమెరాలో…ఒలంపిక్ వెలుగు జిలుగులు

అకాశంలో నక్షత్రాల వెలుగు జిలుగుల్లా ఫోటోలో ఒలంపిక్స్ విలేజ్ చికట్లో వెలుగులను వెదజిమ్ముతున్న దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి.

Nasa Photo : నాసా స్పేస్  కెమెరాలో…ఒలంపిక్ వెలుగు జిలుగులు

Nasa Olampics

Updated On : July 29, 2021 / 1:26 PM IST

Nasa Photo:కన్నుల పండుగగా జరుగుతున్న టోక్యోలోని ఒలింపిక్స్ విలేజ్ ఫోటోను నాసా విడుదల చేసింది. ఒలంపిక్స్ వెలుగు జిలుగులను ప్రపంచం కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా చేసిన ప్రయత్నన్ని నెటిజన్లు తెగమెచ్చకుంటున్నారు. రాత్రివేళ స్పేస్ స్టేషన్ నుండి ఈ ఫోటోను తీశారు. ఐఎస్ఎస్ కు చెందిన వింటేజ్ పాయింట్ నుండి ఈ చిత్రాన్ని తీసినట్లు నాసా తెలిపింది.

అకాశంలో నక్షత్రాల వెలుగు జిలుగుల్లా ఫోటోలో ఒలంపిక్స్ విలేజ్ చికట్లో వెలుగులను వెదజిమ్ముతున్న దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. నాసా తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోను పోస్టు చేయగా, 12గంటల వ్యవధిలోనే 5.3లక్షల లైక్స్ వచ్చాయి. ఇదిలా వుంటే ఒలంపిక్స్ క్రీడలు ఆగస్టు 8వరకు జరగనుండగా, పతకాల సాధనకోసం క్రీడాకారులు పోటీలు పడుతున్నారు.