IND-AUS 2nd ODI : వైజాగ్ లో భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే.. వరుణ గండంతో మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ!

విశాఖ వన్డేకు సర్వం సిద్ధం అయింది. ఆదివారం(మార్చి19,2023)న టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. రెండో వన్డేకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. అయితే మ్యాచ్ పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. వరుణుడు బ్యాంటింగ్ కు దిగితే పరిస్థితి ఏంటని హైరానా పడుతున్నారు.

IND-AUS 2nd ODI : వైజాగ్ లో భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే.. వరుణ గండంతో మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ!

Visakha ODI

IND-AUS 2nd ODI : విశాఖ వన్డేకు సర్వం సిద్ధం అయింది. ఆదివారం(మార్చి19,2023)న టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో వన్డేకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. అయితే మ్యాచ్ పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. వరుణుడు బ్యాంటింగ్ కు దిగితే పరిస్థితి ఏంటని హైరానా పడుతున్నారు. ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం మరో మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. విశాఖ వేదికగా ఆదివారం రెండో వన్డేలో టీమిండియా ఆస్ట్రేలియాను ఢీకొట్టబోతుంది.

ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా జట్లు విశాఖకు చేరుకున్నాయి. తొలి వన్డేలో విజయంతో టీమిండియా జోష్ లో ఉంది, వైజాగ్ లో రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విల్లూరుతోంది. అయితే ఫస్ట్ వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా స్కెచ్ వేస్తోంది. వైజాగ్ వన్డేలో రోహిత్ సేన విజయం సాధిస్తే టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఆసీస్ విజయం సాధిస్తే మూడో వన్డే ఇరు జట్లకు కీలకం కానుంది.

IND vs AUS 1st ODI: 5 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు.. కేఎల్ రాహుల్ 75 పరుగులు బాది నాటౌట్

తన బావ మరిది పెళ్లి కారణంగా తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డేలో ఆడనున్నాడు.
రోహిత్ ఆడితే తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తిగా మారింది. మొదటి వన్డేలో సూపర్ ఇన్నింగ్స్ తో కేఎల్ రాహుల్ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఫస్ట్ వన్డేలో విఫలమైన ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ లో ఒకరిపై వేటు పడే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో మార్పులేమీ ఉండకపోవచ్చు. ఇక ఆసీస్ అదే టీమ్ రంగంలోకి దిగే అవకాశం ఉంది.

విశాఖలో టీమిండియాదే విజయమని నిపుణులు అంటున్నారు. గతంలో వైజాగ్ స్టేడియంలో జరిగిన మ్యాచుల రిజల్ట్సే ఇందుకు ఉదాహరణ అంటున్నారు. ఇప్పటివరకు 9 మ్యాచులు జరగ్గా టీమిండియా 7 సార్లు విక్టరీ కొట్టింది. ఒక మ్యాచ్ లో పరాజయం పాలైతే, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఎవరి అంచనాల్లో వారుంటే ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. వైజాగ్ వన్డేకు వరుణుడి గండం పొంచివుంది.

WPL 2023 GG vs DC : వామ్మో ఇదేం కొట్టుడు.. 28బంతుల్లోనే 76 రన్స్. 10ఫోర్లు, 5సిక్సులు.. లేడీ సెహ్వాగ్ ఊచకోత

ఇప్పటికే రెండు రోజులుగా విశాఖలో ఉరుములు ఊదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మార్చి 20 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సైతం హెచ్చరించింది. ఏసీఏ వీడిసిఎ స్టేడియంలోని పిచ్ ను పూర్తిగా కప్పిఉంచారు. అవుట్ ఫీల్డ్ కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ నిర్వహణ పై ఉత్కంఠ నెలకొంది. దీంతో వరుణుడు కరుణిస్తాడా? ఆదివారం మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న టెన్షన్ క్రికెట్ ఫ్యాన్స్ లో చోటు చేసుకుంది.