Salman Rushdie: సల్మాన్ రష్దీపై దాడిని ఖండించిన భారత్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

రచయిత సల్మాన్ రష్దీపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ అంశంపై భారత్ స్పందించడం ఇదే తొలిసారి.

Salman Rushdie: సల్మాన్ రష్దీపై దాడిని ఖండించిన భారత్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Salman Rushdie: రెండు వారాల క్రితం రచయిత సల్మాన్ రష్దీపై జరిగిన దాడిని భారత్ తాజాగా ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు అధికారికంగా భారత్ స్పందించింది. రచయిత సల్మాన్ రష్దీపై ఈ నెల 12న దాడి జరిగిన సంగతి తెలిసిందే. హదీ మటార్ అనే వ్యక్తి న్యూయార్క్‌లో సల్మాన్ రష్దీపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

CM KCR: పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చితో రగిలే మంటల తెలంగాణ కావాలా? ప్రశ్నించిన సీఎం కేసీఆర్

ఈ ఘటనలో రష్దీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన మెడ, మోచేతిపై గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. ఒక కంటి చూపు కోల్పోయే అవకాశం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. అయితే, ఈ ఘటనపై భారత్ అధికారికంగా స్పందించింది. దీనిపై గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘హింసకు, తీవ్రవాదానికి భారత్ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది. సల్మాన్ రష్దీపై జరిగిన దాడిని భారత్ ఖండిస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తోంది’’ అంటూ భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రకటన విడుదల చేశారు. రష్దీ భారత్‪లోని కాశ్మీర్ ప్రాంతంలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు.

Sonali Phogat: సోనాలి ఫోగట్ ఒంటిపై గాయాలు.. పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడి

తర్వాత బ్రిటన్‌లో కొంతకాలం ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. ఆయన 1988లో రాసిన ‘శాతానిక్ వెర్సస్’ పుస్తకం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీన్ని ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరాన్‪కు చెందిన మత పెద్దలు ఆయన్ను చంపేందుకు ఫత్వా కూడా జారీ చేశారు. అప్పట్నుంచి ఆయన ప్రత్యేక భద్రత మధ్యే బతుకుతున్నారు. అయితే, ఇటీవల ఆయనపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.