Dry FruitsPrices:తాలిబాన్ల చెరలోఅఫ్గాన్..ఇండియాలో పెరిగిన డ్రై ఫ్రూట్స్ ధరలు

అఫ్గాన్ తాలిబన్ల వశం కావడంతో భారత్ డ్రై ఫ్రూట్స్ ధరలు అమాంతం పెరిగాయి. అఫ్గాన్ లో పరిస్థితి ఇలాగేకొనసాగితే ధరలు మరింతగా పెరగనున్నాయని వ్యాపారులు..

Dry FruitsPrices:తాలిబాన్ల చెరలోఅఫ్గాన్..ఇండియాలో పెరిగిన డ్రై ఫ్రూట్స్ ధరలు

India Impact Of The War In Afghanistan On The Price Increase Of Dryfruits (1)

India impact of the war in afghanistan on the price of dryfruits  : అఫ్గానిస్తాన్ ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక భారత్ లో కొన్నింటికి రెక్కలొచ్చాయి. ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. అఫ్గాన్ తాలిబన్ల వశం కావడం భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వాణిజ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. అప్గాన్ ప్రభుత్వంతో భారత్ కు మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. వాటిలో వాణిజ్యం కూడా ఒకటి. ప్రస్తుతం అఫ్గాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవటంతో భారత్‌లో డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగిపోబోతున్నాయని వ్యాపార విశ్లేషకులు చెబుతున్నారు. అఫ్గాన్ లో ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి భారత్‌కు రాజకీయంగా, ఆర్థికంగా, రక్షణ పరంగా చాలా నష్టమంటూ విశ్లేషణలు భావిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక నష్టాలను పక్కనబెడితే.. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించడం వల్ల.. ఆ ప్రభావం వెంటనే భారత్‌లోని డ్రై ఫ్రూట్స్‌పై పడుతోంది. రత్ నుంచి చాలా రకాల వస్తువులు అఫ్గాన్ దిగుమతి చేసుకుంటుంది. అలాగే అఫ్గాన్ నుంచి మన దేశం కొన్నింటిని దిగుమతి చేసుకునేది. వాటిల్లో ముఖ్యమైనవి.. డ్రై ఫ్రూట్స్ ప్రధానమైనవి. ముఖ్యంగా ఎండు ద్రాక్ష అఫ్గాన్ నుంచే భారత్‌కు భారీ స్థాయిలో దిగుమతి అవుతుంది. కిస్‌మిస్, వాల్‌నట్స్, బాదం, పైన్ నట్, పిస్తా, ఆప్రికాట్, కుంకుమపువ్వును కూడా దిగుమతి చేసుకుంటుంది. అలాగే జీలకర్ర కూడా అక్కడి నుంచే ఎక్కువగా దిగుమతి అవుతుంది.

ఇప్పుడు అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో గతంలోలా ఎగుమతి, దిగుమతులు జరిగే అవకాశాలు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో భారత్‌లో డ్రై ఫ్రూట్స్ ధర విపరీతంగా పెరగనుంది. ఢిల్లీలోని ఖారీ బవాలీ బజార్‌కు అఫ్గాన్ నుంచి దిగుమతులు ఆగస్టులోనే భారీగా తగ్గిపోయాయట. ఈ ప్రభావం డ్రై ఫ్రూట్స్ ధరలపై భారీగా పడనుంది. ధరలు డబుల్ కానున్నాయట. దీపావళి పండుగకు చాలా మంది డ్రై ఫ్రూట్స్ కొంటుంటారు. గిఫ్టులుగా ఇచ్చి పుచ్చుకుంటుంటారు. దీంతో దీపావళి నాటికి అఫ్గాన్‌లో పరిస్థితులు చక్కబడితే అప్పటికి డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గే అవకాశముంది..లేదా రెట్టింపు తప్పదంటున్నారు వ్యాపారులు.

దక్షిణాసియాలో ఆఫ్ఘన్ ఉత్పత్తులకు భారతదేశం అతిపెద్ద మార్కెట్. ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశం దాదాపు 3 బిలియన్ డాలర్లు (రూ. 22,251 కోట్లు) పెట్టుబడి పెట్టింది. భారత్-అఫ్ఘానిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండు దేశాల మధ్య 10 వేల కోట్లకు పైగా ఉంది . 2020-21 ఆర్థిక సంవత్సరంలో, 1.4 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. అంటే రెండు దేశాల మధ్య రూ. 10,387 కోట్లు. అదేవిధంగా, 2019-20లో, రెండు దేశాల మధ్య 1.5 బిలియన్ డాలర్ల (రూ. 11,131 కోట్లు) వాణిజ్యం జరిగింది. 2020-21లో, ఆఫ్ఘనిస్తాన్‌కు భారతదేశం సుమారు రూ .6,129 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది, అయితే భారతదేశం రూ .37,83 కోట్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.

అఫ్గాన్ నుంచి భారత్ కు దిగుమతి అయ్యేవి..
ఎండుద్రాక్ష, వాల్నట్, బాదం, అత్తి పండ్లు, పిస్తా,ఎండు ఆప్రికాట్లను భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఇది కాకుండా, దానిమ్మ, ఆపిల్, చెర్రీ, ఖర్జూరం, పుచ్చకాయ, ఇంగువ, జీలకర్ర,కుంకుమలను కూడా దిగుమతి చేస్తుంది.

భారతదేశం నుండి అఫ్గాన్ కు ఎగుమతి చేయబడిన ఉత్పత్తులు..
భారతదేశం నుండి అఫ్గాన్ కు ఎగుమతి చేయబడిన ఉత్పత్తుల్లో.. గోధుమ, కాఫీ, ఏలకులు, నల్ల మిరియాలు, పొగాకు, కొబ్బరి,కొబ్బరి జనపనారతో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా బట్టలు, మిఠాయి వస్తువులు, చేపలు,పలు రకాల కూరగాయలు, నెయ్యి, కూరగాయల నూనె వంటి పలు రకాలను అఫ్గాన్ కు భారత్ ఎగుమతి చేస్తుంది. ఇంకా మొక్కలు, రసాయన ఉత్పత్తులు,సబ్బులు, మందులు, యాంటీబయాటిక్స్, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ వస్తువులు, రబ్బరు ఉత్పత్తులు, సైనిక పరికరాలతో సహా ఇతర ఉత్పత్తులను కూడా ఎగుమతి చేస్తుంది.

అప్గాన్ పరిస్థితులు ఢిల్లీలో పెరిగిన డ్రైప్రూట్స్ ధరలు
డ్రై ఫ్రూట్స్ ధరలు 10% పెరిగాయి. హోల్‌సేల్,రిటైల్ మార్కెట్లలో డ్రై ఫ్రూట్స్ ధరలు కూడా పెరిగాయి. ఇండో-ఆఫ్ఘన్ వాణిజ్య మండలి అధ్యక్షుడు కమల్‌జిత్ బజాజ్ ప్రకారం..ఢిల్లీతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో డ్రై ఫ్రూట్స్ ధరలు 5-10%పెరిగాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే..పెద్ద సమస్యలు ఉండవచ్చు. రక్షాబంధన్ సందర్భంగా షాపింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్‌లు కూడా ధరల పెరుగుదల చూసి ఆశ్చర్యపోతున్నారు.

భారతదేశం యొక్క ప్రపంచ వ్యాపారం ప్రభావితమవుతుంది..
గత 20 ఏళ్లలో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో సుమారు 22 వేల 251 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఇరాన్‌లోని చాబహార్ పోర్టును ఆఫ్ఘనిస్తాన్‌కు రహదారి ద్వారా అనుసంధానించడం దీని వెనుక భారత వ్యూహం. ఇరాన్‌లోని చాబహార్ పోర్టు నుండి ఆఫ్ఘనిస్తాన్‌లోని డెలారామ్ వరకు రహదారి ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇది ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సెంట్రల్ యూరప్‌కి భారతదేశానికి ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది.

ఈ మార్గం ద్వారా, భారతదేశం కూడా మధ్య యూరప్‌తో వ్యాపారం చేయగలదు.గత రెండు దశాబ్దాలలో, ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి భారతదేశం చాలానే చేసింది. దేలారం మరియు జరంజ్ సల్మా డ్యామ్ మధ్య 218 కిలోమీటర్ల పొడవైన రహదారిని భారతదేశం నిర్మించింది. ఇది కాకుండా..ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటును కూడా భారతదేశం నిర్మించింది.

దిగుమతి ఎలా జరుగుతుంది?
ఆఫ్ఘనిస్తాన్ అన్ని వైపులా భూమి చుట్టూ ఉంది. అంటే, దానికి సముద్ర సరిహద్దు లేదు. ఇది వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్ మీదుగా భారతదేశానికి ఎగుమతి చేస్తుంది. దీనితో పాటు, ఇప్పుడు అది ఇరాన్ లోని చాబహార్ పోర్టు ద్వారా ఎగుమతి చేయడం కూడా ప్రారంభించింది. భారతదేశానికి గాలి ద్వారా ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ సరఫరా చేయబడతాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశ ఎగుమతులలో ఎండిన పండ్లు గణనీయమైన వాటా కలిగి ఉన్నాయి.

ఈ క్రమంలో అప్గాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవటంతో ఈ ప్రభావం భారత్ పై కూడా పడనుంది. డ్రై ఫ్రూట్స్ రేట్లు భారీగా పెరగనున్నాయి. కాగా ప్రజల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ తాలిబన్ ఉగ్రమూకలు ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్నాయి. కాబూల్‌ను కూడా తాలిబన్లు ఆక్రమించడంతో అధ్యక్షుడు సైతం వేరే దేశానికి పారిపోయాడు. దీంతో అఫ్గాన్ పూర్తిగా తాలిబన్ల వశమైంది.